NTV Telugu Site icon

Telangana Rains : దెబ్బతిన్న రైల్వే ట్రాక్స్‌కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

Railway Track

Railway Track

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్ లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మూడు చోట్ల సుమారు వెయ్యి మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్లు పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా రద్దయ్యాయి. 68 రైళ్లను దారి మళ్లించారు. ట్రాక్పైకి వరద నీరు చేరడంతో కాజీపేట-విజయవాడ మార్గంలో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లించిన రైళ్లు 5-10 గంటల ఆలస్యంగా గమ్యస్థానం చేరుకున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ద.మ. రైల్వే సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ‘ఎమర్జెన్సీ కంట్రోల్ రూం’ను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరదనీటికి తీవ్రంగా దెబ్బతింది. కింద ఉండే కంకర కొట్టుకుపోవడంతో ట్రాక్ వేలాడింది. తాళ్లపూసపల్లి- మహబూబాబాద్ స్టేషన్ల మధ్య వరదనీరు రైల్వేట్రాక్ని కోతకు గురైంది. కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్ల మధ్య కంకర కొట్టుకుపోవడంతో రైలు పట్టాలు వేలాడాయి.

 Power Boats In Vijayawada: ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. విజయవాడకు చేరిన పవర్ బోట్స్..!

వరంగల్ మహబూబాబాద్ పరిధిలో మూడు చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బతిని మూడు ప్రధాన ప్రాంతాల్లో ట్రాక్ దెబ్బతినడంతో యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. 418 .419.. 452 .. ట్రాక్ డిస్టెన్స్ లో సుమారు 20 చోట్ల పట్టాలకి డామేజ్ జరిగింది చిన్నచిన్న డామేజ్ లను ఇప్పటికే మరమ్మత్తు చేసిన రైల్వే అధికారులు.. ఇంటికన్నె తాళ్ల పూసల పల్లి గార్ల దగ్గర జరిగిన డ్యామేజ్ మరమ్మత్ కోసం సుమారు 1000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంటికళ్ల దగ్గర 250 మంది పని చేస్తే, తాళ్ల పూసల పల్లి దగ్గర 200 మంది వర్కర్లు ట్రాక్ నీ మరమ్మతు చేసే పనిలో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ అనిల్ జైన్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సుబ్రమణ్యం దెబ్బతిన్న ట్రాక్ ని అధికారుల తో కలిసి పరిశీలించారు పనులు వేగవంతంగా నిర్వహించాలని సూచించారు ఇంటికళ్ల దగ్గర నాలుగు జెసిబి లతో ట్రాక్ మరమ్మతు పనులు చేపడుతున్నారు సుమారు పదివేల ఇసుక బస్తాలని అందుబాటులో ఉంచుకున్నారు.
Air India: పలు కొత్త మార్గాలలో ఎయిర్ఇండియా సర్వీసులు ప్రారంభం..