మరోసారి కాంగ్రెస్ నేత రేణుక చౌదరి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కు హెచ్చరిక.. ఖమ్మం జిల్లా మీ మంత్రి దోపిడీ.. దొంగతనలు తెలియడం లేదా? అక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. బీజేపీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తుందని కేసీఅర్ అంటున్నారని, మరి ఖమ్మం జిల్లాలో ఆరు మంది ఎమ్మెల్యే లు కేసీఆర్ సత్య నారాయణ వ్రతం చేసి ప్రసాదం ఇస్తే వచ్చారా ? అంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవని, రాబోయే రోజుల్లో కేసీఆర్ కరెంట్ షాక్ ఇస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణను కేసీఆర్ సర్వ నాశనం చేశారంటూ ఆమె విమర్శించారు. ఈ కొత్త సంవత్సరంలో కేసీఆర్ నిజాలు చెప్పడం అలవాటు చేసుకుంటారు అనుకుంటున్న అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Vladimir Putin: ఫూల్స్ చేయొద్దంటూ పుతిన్ ఫైర్.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్
కేసీఆర్ తెలంగాణపై అమోఘమైన వ్యామోహం చూపిస్తున్నారని, ఇప్పుడు దేశంలో కేసీఅర్ కు తాలిబాన్ గుర్తుకు వచ్చిందన్నారు. మోడీకి అన్ని రకాల మద్దతు ఇచ్చారు కేసీఅర్… ట్రిపుల్ తలక్ కు కేసీఅర్ మద్దతు ఇచ్చారని, ఈశాన్య మూల అని.. మంచి జరుగుతుంది అని కేసీఅర్ ఖమ్మంలో కార్యక్రమాలు మొదలు పెట్టారన్నారు. కానీ అది ఖమ్మంలో ఉండే వారికి మాత్రమే మంచి జరుగుతుంది అని గుర్తు పెట్టుకో అని అన్నారు. మా పార్టీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారు? కేసీఅర్ సమాధానం చెప్పాలన్నారు. ఖమ్మం… కాంగ్రెస్ జిల్లా.. అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని, ఖమ్మం బీఆర్‌ఎస్ సభకు ఎంఐఎం పిలుపు గురించి ఇప్పుడు చర్చ లేదున్నారు. ఖమ్మంలో కేసీఅర్ బీఆర్‌ఎస్ సభతో వీఆర్‌ఎస్ ఇస్తారని ఆమె వ్యాఖ్యానించారు.