Russia President Vladimir Putin Fires On Minister Manturov: ఉపప్రధాని డెనిస్ మంటురోవ్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వాధికారుల సమావేశంలో జరిగిన వీడియో కాల్‌లో పుతిన్ మాట్లాడుతూ.. అందరినీ ఫూల్స్ చేయడం ఆపాలని ఆయనకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశ పౌర సైనిక విమాన ఒప్పందం విషయంలో జాప్యం చేయడం వల్లే.. ఈ విధంగా మంటురోవ్‌పై పుతిన్ మాటల తుటాలు పేల్చారు. 2023 ఏడాదికి సంబంధించి.. పౌర సైనిక ఒప్పందాల్ని నెల రోజులలోపు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. అసలు మేటర్ ఏమిటంటే.. రష్యా విమానాయన సంస్థ ఏరోప్లాట్‌తో 175 బిలియన్ల రూబిళ్లు (మన భారత కరెన్సీలో 21 వేల కోట్లు) విలువైన ఒప్పందాలను ఏర్పాటు చేసే బాధ్యతను మంటురోవ్‌కు అప్పగించారు. అయితే.. ఈ ఒప్పందాలేవీ సిద్ధం అవ్వలేదు. అందుకే.. ఆయన పనితీరుపై పుతిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Woman Lift Lion: ఈమె మామూలు లేడీ కాదు.. సింహాన్నే మోసుకెళ్లింది
ఈ ఒప్పందాలు ఈపాటికే పూర్తి అవ్వాల్సిందని.. కానీ మీరు దీనికి చాలా సమయం తీసుకుంటున్నారని మంటురోవ్‌పై పుతిన్ మండిపడ్డారు. సాధ్యమైనంత త్వరగా ఈ ఒప్పందాలను పూర్తి చేయాలని నొక్కిచెప్పారు. ఇప్పటివరకు ఏ ఎంటర్‌ప్రైజెస్‌తోనూ మీరు ఒప్పందాలు చేసుకోలేదన్న విషయం తనకు తెలుసని, ఇకపై ఎలాంటి జాప్యం జరగకుండా త్వరగా పనులు ముగించాలని ఆర్డర్ చేశారు. అనవసరమైన బిల్డప్పులకు వెళ్లకుండా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా ప్రయత్నించాలని చెప్పారు. ఒప్పందాలు పూర్తయ్యాక.. ఎప్పుడు సంతకాలు చేశారన్న వివరాలనూ చెప్పాల్సిందిగా తెలిపారు. ఈ ఒప్పందాల ఏర్పాటుకు మంటురోవ్‌కి పుతిన్ నెలరోజుల గడువు ఇచ్చారు. ఇందుకు మంటురోవ్ స్పందిస్తూ.. ఆ ఒప్పందాలకి సంబంధించిన ఆర్డర్‌లు సిద్ధంగానే ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
Income Tax : మీరు ఇలా చేస్తే ఇన్ కం టాక్స్ రూపాయి కట్టనక్కర్లేదు