ములుగులో కాంగ్రెస్ నేత రేణుక చౌదరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లిక్కర్ కేసుకి రాజకీయ కక్ష్యలని రంగులు పూస్తున్నారన్నారు. కవితమ్మ కేసులో ఏం జరుగుతుందో అని మేము కూడా ఎదురు చూస్తున్నామన ఆమె అన్నారు. కేంద్రం ఏమైనా బయటపెడుతుందేమో చూద్దామని ఆమె అన్నారు. మాపై దాడులు జరుగుతుంటే అప్పుడు లేదా తెలంగాణ గౌరవం అని ఆమె మండిపడ్డారు. ఒక్క కవితమ్మతోనే తెలంగాణ గౌరవమా కట్టుబడి ఉందా…? అని ఆమె ప్రశ్నించారు. మిగతా వాళ్లు ఆడవాళ్లు కాదా ఈ గడ్డ మీద పుట్టలేదా..? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరోజు అయితే టీఆర్ఎస్ వదిలి బీఆర్ఎస్ గా మారారో.. అప్పుడే తండ్రి, కొడుకు, కూతుర్ల అధికారం ఖతం అని ఆమె అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజే తెలంగాణ గౌరవం పోయిందని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Tamil Nadu: అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు.. పొత్తు సంగతేంటి?
ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గత వారం వ్యాఖలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్‌రెడ్డి కి ఆత్మశాంతి లేకుండా జగన్ ఈ పిచ్చివేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అప్పుడు కూడా పిచ్చి వేషాలు వేసే వారని.. అయితే తండ్రిగా రాజశేఖర్ రెడ్డి బయటకు రాకుండా కాపాడినట్లు తెలిపారు రేణుకా చౌదరి. ఇక్కడి ప్రజల పరిస్ధితి చూస్తో జాలిపడాలా, కోపం తెచ్చుకోవాలా, అక్రోషం తెచ్చుకోవాలో అర్ధం కావడం లేదన్నారు.
Also Read : Chigurupati Jayaram Case: జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు