NTV Telugu Site icon

Renuka Chowdhury: నీకు ఎందుకు ఓటు వేయాలి.. కేసీఆర్ కి రేణుకా చౌదరి సవాల్..

Renuka

Renuka

నీకు ఎందుకు ఓటు వేయాలి అని సీఎం కేసీఆర్ కి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సవాల్ విసిరారు. తెలంగాణలో మహిళలకు రక్షణ ఉందా?.. అత్యాచారం చేసిన వాళ్ళకు అధికార పార్టీ నేతలు అండగా ఉన్నారు.. బాల్య వివాహాలు జరుగుతుంటే ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం.. కేజీ టూ పీజీ అని గొప్పలు చెప్పారు కేసీఆర్.. 42 శాతం మహిళలు ఇప్పటికి వేలిముద్రలే వేస్తున్నారు.. ఇది సిగ్గుచేటు కాదా కేటీఆర్.. హైటెక్కుల గురించి మాట్లాడే కేటీఆర్.. మహిళ అక్షరాస్యతపై ఏం టెక్కులు చూపిస్తారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Team India: టీమిండియా అద్భుత బ్యాటింగ్.. పాక్ మాజీ కెప్టెన్ పొగడ్తల వర్షం..

తెలంగాణ రాష్ట్రంలో కవిత ఒక్కతే బాగుపడింది అని రేణుకా చౌదరి మండిపడింది. కవిత తప్పా, మిగిలిన ఆడవాళ్లు అభివృద్దే లేదు.. మహిళలకు మొదట మంత్రి పదవే ఇవ్వలేదు కేసీఆర్.. కేసీఆర్ ప్రభుత్వం యూజ్ లేస్ ప్రభుత్వం.. బంగారు తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు.. బంగారం లేదు.. అప్పులే మిగిలాయి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రైతులకు డబ్బులు ఇచ్చాడు.. కానీ, తెలంగాణలోమహిళా రైతులకు ఏం ఇచ్చావు అని ప్రశ్నించారు. మహిళలకు మేము ఇచ్చిన పావలా వడ్డీ ఎక్కడ?.. మేము ఇచ్చిన నిత్యావసరాలు బంద్ చేశారు.. మహిళా ఓట్లతోనే కాంగ్రెస్ గెలుస్తోంది అని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మా చేతుల గాజులు.. విష్ణు చక్రాలుగా మారిపోతున్నాయి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. కేసీఆర్, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు.. పార్టీ పేరులోనే తెలంగాణ తీసేశారు.. కమ్మ, బీసీలకు సామాజిక న్యాయం సీట్ల విషయంలో దక్కలేదు అంటూ ఆమె మండిపడింది. కానీ, అన్ని కులాల వారికి సాయం చేసే గుణం మాది అని రేణుకా చౌదరి పేర్కొనింది.