Renu Desai : నన్ను వదిన అని పిలవద్దు.. జానీ మాస్టర్‌కి రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత ఆమె సినీ జీవితానికి వీడ్కోలు పలకడం, పిల్లలు అకీరా నందన్, ఆద్యలే లోకంగా బతకడం, ఎన్జీవో ద్వారా మూగ జీవాల సంరక్షణలో భాగంగా పని చేయడం అలా ప్రశాంతమైన జీవితం గడుపుతొంది. రెండో పెళ్లిపై గాసిప్స్ వచ్చినప్పటికీ అవన్నీ గాలి వార్తలు అని రేణు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తుంది. అలా సంప్రదాయాలు, కట్టుబాట్లకు విలువనిచ్చే, ఆధ్యాత్మిక మార్గాన్ని ఇష్టపడే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నా, ఎవరి అనుమతి లేకుండా ఆమె జీవిస్తున్నాను అని గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా..
Also Read : Rashi Khanna: నా కంఫర్ట్ జోన్ దాటి దిగజారిపోయే పాత్రలు నాకొద్దు..
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
లాంగ్ గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పదహారు రోజుల పండుగ’ మూవీలో తాను నటిస్తోందని ప్రకటించారు. సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా, ఉద్యన్ హీరోయిన్‌గా, సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, కృష్ణుడు, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రదా పిక్చర్స్, సాయి సినీ బ్యానర్‌పై సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ నిర్మాణం చేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఓపెనింగ్ కార్యక్రమంలో జానీ మాస్టర్ రేణు ను చూసి “వదిన” అని పిలిచారు. అయితే రేణు సీరియస్ అయ్యి “నీకు ఎన్నిసార్లు చెప్పాలి వదిన అని పిలవద్దు, అక్క అని పిలువు” అన్నారు. దీంతో జానీ మాస్టర్ నమస్కారం చేసి, పక్కన ఉన్న అనసూయ భరద్వాజ్‌ను పలకరించాడు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!