Site icon NTV Telugu

Renu Desai: ప్రధాని పక్కన నా కుమారుడు.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!

Renu Desai

Renu Desai

Renu Desai Happy After Akira Nandan Meets PM Modi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెలేగా పోటీ చేసిన పవన్‌.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులను ఆయన గెలిపించుకున్నారు. దాంతో పవన్ అభిమానులతో సహా ఫామిలీ మెంబర్స్ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించినప్పటి నుంచి అకీరా నందన్ తండ్రితోనే ఉంటున్నాడు. రాజకీయ ప్రముఖులకు అకీరాను పవన్‌ పరిచయం చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని పవన్, అకీరాలు ఢిల్లీలో కలిసిన విషయం తెలిసిందే. బుధవారం ఎన్డీఏ కూటమి భేటీ ముగిసిన అనంతరం ప్రధానికి తన కుటుంబాన్ని జనసేనాని పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోడీకి అకీరా నమస్కరిస్తుండగా.. అతడి భుజంపై చేయి వేసి ప్రధాని మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై అకీరా తల్లి రేణు దేశాయ్‌ ఓ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు.

Also Read: Sharwanand: సీనియర్ నటి కాళ్లు మొక్కిన హీరో శర్వానంద్‌.. వీడియో వైరల్!

‘నాకు ముందు నుంచి బీజేపీ అంటే అభిమానం. ప్రధాని నరేంద్ర మోడీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే.. ఎంతో ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. ప్రధాని గారిని కలిశాక అకీరా నాకు ఫోన్‌ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. మోడీ చాలా గొప్ప వ్యక్తి అని, తన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్‌ ఉందని నాతో చెప్పాడు’ అని రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Exit mobile version