NTV Telugu Site icon

Hyderabad Drugs: డ్రగ్స్కు హబ్గా మారుతున్న పేరు మోసిన కాలేజీలు..

Drugs

Drugs

హైదరాబాద్లో ప్రముఖ విద్యా సంస్థలు డ్రగ్స్కు అడ్డాగా మారుతున్నాయి. గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్, గంజాయికి గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్డాగా మారిపోయింది. అనుమానం ఉన్న స్కూల్స్లో నార్కోటిక్ బ్యూరో స్నిపర్ డాగ్స్ తో తనిఖీలు చేపట్టింది. గంజాయి సేవిస్తూ 15 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఇండస్ స్కూల్లోనూ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ-సిగరెట్కు అలవాటు పడ్డారు విద్యార్థులు. ఉస్మానియా మెడికల్ కాలేజ్, సీబీఐటి, గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్, త్రిబుల్ ఐటీ బాసర లాంటి సంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారు విద్యార్థులు.. స్టూడెంట్స్ మత్తు పదార్థాల బారిన పడుతున్నట్లుగా గుర్తించిన నార్కోటిక్ బ్యూరో.. నోవాటెల్లోని ఆర్టిస్ట్రీ పబ్బుల్లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. కెవ్ పబ్బులో నిర్వహించిన పార్టీలో 52 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తే 33 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు.

Lalu Prasad Yadav: కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్ రాజీనామా చేయాలి

కోప్టా యాక్ట్ నిబంధనలు పాటిస్తున్నామని నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. స్కూల్ ఆవరణలో గంజాయితో పట్టుబడితే జువైనల్ ఆక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మరోవైపు.. సింబయోసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. అలాగే.. ఉస్మానియా హాస్పిటల్ లో ఆరుగురు జూనియర్ డాక్టర్లు గంజాయి సేవిస్తూ అరెస్టు అయ్యారు. జూనియర్ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు లేఖ రాశారు. మరోవైపు.. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో గంజాయి సేవిస్తున్న 15 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. అలాగే.. సీబీఐటీ కాలేజీలో మరో విద్యార్థికి గంజాయి పాజిటివ్ వచ్చింది. త్రిబుల్ ఐటీ బాసరలో పలువురు విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. త్రిబుల్ ఐటీ బాసరకు నాందేడ్ నుండి గంజాయి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జేఎన్టీయూ జోగిపేట్ లో ముగ్గురు గంజాయితో పట్టుబడ్డారు. ఇండస్ స్కూల్ తో పాటు సిబిఐటీకి చెందిన పలువురు విద్యార్థులు ఈ-సిగరేట్ కు అలవాటు అయ్యారు.

Pushpa 2: పుష్ప 2 పుకార్లకు బ్రేక్.. ఇక మొదలెడదామా?

హైదరాబాదులో పార్టీలు నిర్వహిస్తున్న డీజేలపై ప్రత్యేక నిఘా పెట్టామని అధికారులు తెలిపారు. పలు పబ్బులలో మైనర్లకు మద్యం సరఫరా చేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉన్నత పేరు కలిగిన విద్యాసంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నాము.. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ద వహించాలని నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ను అరికట్టేందుకు తెలంగాణ పోలీస్తో పాటు టీఎస్ న్యాబ్ కృషి చేస్తుందన్నారు. గత కొన్ని నెలలుగా డ్రగ్స్ అరికట్టడమే ధ్యేయంగా పని చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటు టెక్నికల్ సహకారంతో డ్రగ్స్ ముఠాలను వెంటాడుతున్నామని.. డ్రగ్ పెడ్లర్లలో ఒక భయాన్ని సృష్టించామని తెలిపారు. డ్రగ్స్కి హాట్స్పాట్గా మారిన పబ్బులపై నిరంతర తనిఖీలు నిర్వహించామని నార్కోటిక్ అధికారులు చెబుతున్నారు.