NTV Telugu Site icon

Pragathi Bhavan: ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ నుంచి వెహికిల్స్..

Pragathibhavan

Pragathibhavan

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది. ప్రగతిభవన్ దగ్గర ఉన్న ఆంక్షలను ఎత్తి వేసింది. పదేళ్లుగా ప్రగతి భవన్ ముందున్న కంచెలు తొలగించాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో క్లారిటీ వచ్చిన వెంటనే.. సెక్రటేరియట్, ప్రగతిభవన్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాపాలనలో సెక్రటేరియట్, ప్రగతిభవన్ తలుపులు ప్రజల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయని వెల్లడించారు. ఇక, ప్రగతిభవన్ పేరును డా. బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా పేరు మార్చారు. ఇందులో భాగంగా ఆ దిశగా పోలీసులు చర్యల చేపట్టారు.

Read Also: Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్

అయితే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ కు ఈ కంచె ఏర్పాటు చేశారు. ఇక, ధర్నాలు, ఆందోళనలు అడ్డుకునేందుకు ఈ కంచె ఏర్పాటు చేశారని అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు నిర్భయంగా ప్రగతి భవన్ కు రావొచ్చని.. తమ ఫిర్యాదులను సీఎంకు చెప్పే స్వేచ్ఛ ఉందని రేవంత్ రెడ్డి తెలపడంతో కంచె తొలగింపు పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కంచెను తొలగించడం వల్ల.. ఆ రూట్లో వెళ్లే వాహన దారులకు కొంత ఉపశమనం దొరికే ఛాన్స్ ఉంది. మరోవైపు, ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ లోపలి నుంచి ట్రాఫిక్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. బ్యారికేడ్స్ తొలగింపుతో ట్రాఫిక్ కు పర్మిషన్ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ చర్య కొనసాగుతుంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా బ్యారికేడ్లను తొలగించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ అయ్యాయి.

Show comments