NTV Telugu Site icon

AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్‌

Remand Tdp

Remand Tdp

రాజమహేంద్రవరం నగర టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, ఆమె మామ, మాజీ ఎమ్మెల్సీ అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సీఐడీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 17 గంటల విచారణ అనంతరం రాత్రి 10 గంటలకు వారి అరెస్టును సీఐడీ అధికారులు ధ్రువీకరించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఇద్దరికీ మే 12వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ జిల్లా జడ్జి అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

Read Also: Heavy Rain : భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ ల అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పట్టాభి సీఐడీ తీరుని తప్పుబట్టారు. ఇది కక్ష సాధింపు అనే అనుకోవాలి. 30 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. ఎప్పుడూ కనిపించనివి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి. చాలా ప్రభుత్వాలు మారాయి. ఏదైనా లోటుపాట్లు ఉంటే అప్పటి నుంచి బయటకు వచ్చేవి. ఫిర్యాదులు చేసేవారు. కానీ ఇవేమీ లేకుండా.. ఈ నాలుగేళ్లుగా చూస్తున్నాం అంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగజ్జననీ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయన్న అభియోగాలపై ఆ సంస్థ డైరెక్టర్లు.. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమేరకు సీఐడీ కేంద్ర కార్యాలయం ధ్రువీకరించింది. కాకినాడకు చెందిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కొర్ని వరప్రసాద్‌ ఏప్రిల్‌ 29న సీఐడీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై అధికారులు 420, 409, 120, 477, రెడ్‌విత్‌ సెక్షన్‌ 34 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిబంధనలు పాటించడం లేదని, ఆర్ బీఐకి తెలీకుండా డిపాజిట్లు సేకరించారని వీరిపై అభియోగాలున్నాయి.

Read Also:MLA Kannababu: ఎమ్మెల్యేకి నిరసన సెగ.. చేయి చేసుకున్న కన్నబాబు

సంస్థ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి కుమార్తె వెంకట జోత్స్నతో పాటు జగజ్జననీ సంస్థను నిందితులుగా చేర్చారు. ఆదివారం సుమారు 17 గంటల విచారణ జరిగిన తర్వాత రాత్రి 10 గంటలకు వారి ఇద్దరి అరెస్టును సీఐడీ అధికారులు ధ్రువీకరించారు. వారిని అరెస్టు చేశారా.. లేదా అన్న అంశంపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. స్థానిక సీఐడీ కార్యాలయం వద్ద రోజంతా ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అరెస్టు చేసిన ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లను జీజీహెచ్‌కు తరలించి, అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. సుమారు రెండు గంటలు వాదనల అనంతరం ఇద్దరికీ మే 12వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం తమ కుటుంబంపై కక్ష కట్టిందని దీనిని న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటామని ఆదిరెడ్డి భవానీ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఫోన్ చేసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read Also: Heavy Rain : భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

Show comments