Church Vandalised : చర్చిని ధ్వంసం చేసిన దుండగులు.. కర్ణాటకలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Church Vandalised : కర్ణాటకలోని మైసూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ చర్చిని మంగళవారం కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. బాల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ముక్కలు చేశారు. క్రిస్మస్ వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈ దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మైసూరులోని పెరియపట్నంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చిలో ఇటీవల క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే మంగళవారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండుగులు ఈ చర్చిని, ఏసు విగ్రహాన్ని కూడా ధ్వసంచేసినట్లు పోలీసులు తెలిపారు. చర్చి వెనుక తలుపులు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారని అన్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.
Read Also: Nasal Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ వేసుకోవద్దు
Also Read
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
దుండగులు దొంగతనం కోసమా, కేవలం దాడి కోసమా వచ్చారన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు. చర్చి వెలుపల ఉంచిన ఒక విరాళాల పెట్టేతో పాటు డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పారు. దొంగతనం కేసుగా భావిస్తున్నామని మైసూర్పోలీస్ సూపరింటెండెంట్ సీమా లత్కర్ అన్నారు. మత మార్పిడుల ఆరోపణలపై గత కొన్ని నెలలుగా చర్చిలు, క్రైస్తవ మిషనరీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కర్రలు, ఆయుధాలతో డాడి చేశారు. బలవంతంపు మత మార్పిళ్లకు నిషేదిస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
Miscreants damaged statue of #JesusChrist kept at altar & took money 4m donation box from a #Church in periyapatna #Mysuru. Priest was away when the incident happened.Miscreant,however,didn't damage the main statue of Jesus.We are looking into all the angles: cops #Karnataka pic.twitter.com/5jitzu80GB
— Imran Khan (@KeypadGuerilla) December 28, 2022
Karnataka | A church was allegedly vandalised y'day by some unknown miscreants in Piriyapatna in Mysuru. Various items kept in the church including the Baby Jesus statue were found damaged. pic.twitter.com/UAoLGPt0G5
— ANI (@ANI) December 28, 2022
తాజావార్తలు
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!