Nasal Vaccine : కోవిద్ మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే మూడు డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్ డోస్ కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మూడో డోస్ తీసుకున్న వారు కొత్తగా వచ్చిన నాసల్ వ్యాక్సిన్ తీసుకోవద్దని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్, దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎన్ కే అరోరా హెచ్చరించారు. బూస్టర్ డోస్ తీసుకోని వారు మాత్రమే నాసల్ డోసు తీసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ కాదని నాసల్ డోస్ కూడా తీసుకుంటే ఆ వ్యక్తి శరీరం స్పందన ఆగిపోతుందని, స్పందించినా అది చాలా తక్కువగా ఉంటుందన్నారు. అందుకే తొలి రెండు డోసుల మధ్య గ్యాప్ ని ఆరు నెలలు విధించామని, తర్వాత మూడో డోసుకి మూడు నెలలు వ్యవధి ఉంచామన్నారు.
Read Also: UP COP Fails to Load, Fire Rifle : గన్లో బుల్లెట్ ఎక్కడ పెట్టాలో తెలియదు.. ఇతనో ఎస్ఐ
బూస్టర్ డోస్ అనుకున్న ఫలితం రాలేదని అందుకే నాలుగో డోసుగా నాసల్ డోస్ వద్దని చెప్తున్నామన్నారు. బూస్టర్ డోస్ తీసుకోని వారికి మాత్రమే నాసల్ టీకాను వేసుకోవాలని రిఫర్ చేస్తున్నామన్నారు. మరో ప్రకటనలో చైనాలో కోవిడ్ వ్యాప్తికి నాలుగు వేరియంట్లు కారణమని ప్రకటించారు. బీఎఫ్ 7 వేరియంట్ కేసులు 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయన్నారు, మిగతా వాటిలో 50 శాతం కేసులు అధికంగా బీఎన్, బీక్యూ వేరియంట్ల ద్వారా వస్తున్నాయన్నారు. అలాగే ఎస్వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్ల భారతీయులకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ లభించిందని, అందువల్ల మనవాళ్లు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఇది ఇలా ఉంటే కరోనా కేసుల విషయంలో చైనా సమాచారాన్ని దాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.