NTV Telugu Site icon

Church Vandalised : చర్చిని ధ్వంసం చేసిన దుండగులు.. కర్ణాటకలో ఉద్రిక్తత

Karnataka Church

Karnataka Church

Church Vandalised : కర్ణాటకలోని మైసూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ చర్చిని మంగళవారం కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. బాల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ముక్కలు చేశారు. క్రిస్మస్ వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈ దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మైసూరులోని పెరియపట్నంలో ఉన్న సెయింట్‌ మేరీస్‌ చర్చిలో ఇటీవల క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే మంగళవారం రాత్రి కొందరు గుర్తుతెలియని దుండుగులు ఈ చర్చిని, ఏసు విగ్రహాన్ని కూడా ధ్వసంచేసినట్లు పోలీసులు తెలిపారు. చర్చి వెనుక తలుపులు పగుల గొట్టి లోపలికి ప్రవేశించారని అన్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.

Read Also: Nasal Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారు నాసల్ వ్యాక్సిన్ వేసుకోవద్దు

దుండగులు దొంగతనం కోసమా, కేవలం దాడి కోసమా వచ్చారన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు. చర్చి వెలుపల ఉంచిన ఒక విరాళాల పెట్టేతో పాటు డబ్బును ఎత్తుకెళ్లారని చెప్పారు. దొంగతనం కేసుగా భావిస్తున్నామని మైసూర్‌పోలీస్‌ సూపరింటెండెంట్‌ సీమా లత్కర్‌ అన్నారు. మత మార్పిడుల ఆరోపణలపై గత కొన్ని నెలలుగా చర్చిలు, క్రైస్తవ మిషనరీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలో బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొంతమంది కర్రలు, ఆయుధాలతో డాడి చేశారు. బలవంతంపు మత మార్పిళ్లకు నిషేదిస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.