Supreme Court: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్‌లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. ఏపీ, తెలంగాణకు చెందిన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పింది సుప్రీంకోర్టు.. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించగా.. వాటిపై స్టేటస్ కో విధించింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: Mumbai: ఘోర విషాదం.. బోటు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
కాగా, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఉల్లంఘించి దొడ్డిదారిన ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. దాని ద్వారా నియామకాలు చేపట్టడం చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం విదితమే.. అయితే, హైకోర్టు ఉత్తర్వులతో తొలగించిన 1,200 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1207 చట్ట విరుద్ధమని పేర్కొంది హైకోర్టు.. అయితే, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో.. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్‌లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కినట్టు అయ్యింది.