Site icon NTV Telugu

Reliance Jio ‘Happy New Year 2026’ ప్రీపెయిడ్ ప్లాన్స్ విడుదల.. గూగుల్ జెమినీ ప్రో AI, OTT బండిల్స్‌ ఇంకా ఎన్నో..!

Jio

Jio

Reliance Jio Happy New Year 2026: భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్తగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ పేరుతో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ తాజా అప్డేట్‌లో మూడు కొత్త రీచార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. డేటా, కాలింగ్‌తో పాటు భారీ OTT కంటెంట్, ఆధునిక AI సేవలను బండిల్ చేయడమే ఈ ప్లాన్స్ ప్రత్యేకత. ప్రత్యేకంగా గూగుల్‌తో భాగస్వామ్యంలో భాగంగా.. Google Gemini Pro AI సబ్‌స్క్రిప్షన్ ను హై-టియర్ ప్లాన్స్‌లో ఉచితంగా అందించడం గమనార్హం. మరి కొత్తగా తీసుకొచ్చిన ప్లన్స్ ఏంటి..? వాటిలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో చూసేద్దామ్మ..

Shocking Incident: రాజస్థాన్ లో దారుణం.. ప్రయాణికుడిపై కండక్టర్ దాడి..

హీరో అన్యువల్ రీచార్జ్:
దీర్ఘకాలిక వినియోగదారుల కోసం రూపొందించిన ఈ ప్లాన్ ధర రూ. 3,599. ఈ ప్లాన్ ప్రధానంగా కనెక్టివిటీ, ప్రొడక్టివిటీపై దృష్టి సారించింది. ఇందులో 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక రోజుకు 2.5GB (అన్‌లిమిటెడ్ 5G డేటా యాక్సెస్‌తో) డేటా లభిస్తుంది. అలాగే ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభించడమే కాకుండా.. ఏకంగా రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమినీ ప్రో AI ప్లాన్ ఉచితంగా పొందవచ్చు. టెక్నాలజీ, AI ఆధారిత పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్:
ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల కోసం రూపొందించిన మంత్లీ ప్లాన్ ఇది. తక్కువ వాలిడిటీ ఉన్నప్పటికీ, అన్యువల్ ప్లాన్‌తో సమానమైన AI బెనిఫిట్‌ను అందిస్తుంది. ఇది కేవలం 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ లో రోజుకు 2GB (అన్‌లిమిటెడ్ 5G డేటా) డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు నెలకు రూ.500 విలువైన OTT స్ట్రీమింగ్ సేవలు లభిస్తాయి. ఇందులో యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (PVME), సోనీ లివ్, జీ5, Lionsgate ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫ్యాన్ కోడ్ , హొయిచోయ్ వంటి లభిస్తాయి. అంతేకాదండోయ్.. అదనపు ప్రయోజనం కింద 18 నెలల గూగుల్ జెమినీ ప్రో AI ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఒకే రీచార్జ్‌తో సినిమాలు, సిరీస్‌లు, స్పోర్ట్స్, AI టూల్స్ అన్నీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ

ఫ్లెక్సీ ప్యాక్:
తక్కువ ధరలో డేటా టాప్-అప్‌తో పాటు ఎంపిక చేసిన కంటెంట్‌ను అందించే ప్లాన్ ఇది. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో 5GB (లంప్‌సమ్) డేటా లభిస్తుంది. ఇందులో కస్టమైజబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్స్ లభిస్తాయి. ఇందులో ఎంపికలను వినియోగదారులు తమ అభిరుచికి తగ్గ ఒక ప్యాక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ కొత్త ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ (Happy New Year 2026) ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను జియో అధికారిక వెబ్‌సైట్, MyJio యాప్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జియో రీటైల్ పాయింట్లలో పొందవచ్చు.

Exit mobile version