NTV Telugu Site icon

Jio 7th Anniversary Offer: జియో యూజర్లకు శుభవార్త.. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు బెనిఫిట్స్!

Reliance Jio New

Reliance Jio New

Reliance Jio 7th Anniversary Offers ends on September 30: ఏడో వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ ఇటీవల ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. మూడు రీఛార్జ్ ప్లాన్స్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 299, రూ. 749, రూ. 2,999 ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికి.. ఈ ప్లాన్స్‌తో వచ్చే ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్స్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఓసారి చూద్దాం.

Jio Rs 299 Plan:
జియో రూ. 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. డైలీ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. దీంతో పాటు అదనంగా 7జీబీ డేటా మీకు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు 7జీబీ డేటా అదనంగా ఉపయోగించుకోవచ్చు.

Jio Rs 749 Plan:
జియో రూ. 749 ప్లాన్ రీఛార్జ్ వ్యాలిడిటీ 90 రోజులు. రోజూ 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. దీంతో పాటు అదనంగా 14జీబీ డేటా మీకు లభిస్తుంది. అంతేకాదు రెండు 7జీబీ డేటా కూపన్స్ కూడా లభిస్తాయి.

Also Read: HONOR 90 Launch: నేడే ‘హానర్‌’ 90 5జీ ఫోన్‌ లాంచ్.. 200 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Jio Rs 2,999 Plan:
జియో రూ. 2,999 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. డైలీ 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. ప్రతిరోజూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. దీంతో పాటు 21జీబీ డేటా అదనంగా లభిస్తుంది. అంతేకాదు మూడు 7జీబీ డేటా కూపన్స్ లభిస్తాయి. రూ. 2,999 ప్లాన్‌పై జియో రూ.200 తగ్గింపు అందిస్తోంది. స్విగ్గీ, మెక్‌డోనాల్డ్స్, ఫ్లైట్ బుకింగ్స్‌, హోటల్ బుకింగ్స్‌పై తగ్గింపు లభిస్తోంది.