Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో, భారతీయ కుటుంబాలకు నిరంతరాయంగా గ్యాస్ (LPG) సరఫరా చేయడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నడుం బిగించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తన జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచుతున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, భారతీయ గృహాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
READ ALSO: Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?
Also Read
- Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్‌పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్‌కు అర్హత..
- Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
- జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!
- Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
నిరంతరాయ సరఫరాకు చర్యలు..
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనింగ్ హబ్‌గా ఉన్న జామ్‌నగర్ ప్లాంట్‌లో ఎల్పీజీ ఉత్పత్తిని ఆప్టిమైజ్ చేయడానికి రిలయన్స్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో గ్యాస్ సరఫరా స్థిరంగా, నమ్మదగినదిగా ఉండేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని సంస్థ పేర్కొంది. దీంతో పాటు, కేజీ-డి6 (KG-D6) బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజ వాయువును కూడా జాతీయ ప్రాధాన్యత రంగాలకు మళ్లించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాలు, దేశ ఇంధన అవసరాలకు అనుగుణంగా ఈ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది.
దేశం కోసమే రిలయన్స్..
“రిలయన్స్‌కు ఎప్పుడూ భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది మంది భారతీయుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత” అని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ.. అత్యంత అవసరమైన రంగాలకు, సామాన్య ప్రజలకు ఇంధనం అందేలా చూస్తామని రిలయన్స్ హామీ ఇచ్చింది. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు రిలయన్స్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
తాజావార్తలు
-
Vijay – Trisha : అన్‌ఫాలో చేసిన త్రిష.. విజయ్‌తో ఇక బ్రేకప్?
-
Ranabali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్‌పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్‌పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్‌కు అర్హత..
-
Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
-
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!