NTV Telugu Site icon

Release Clash : కన్నడ బాక్సాఫీస్ దగ్గర తలపడుతోన్న స్టార్ హీరోస్

Sandilwood

Sandilwood

శాండిల్ వుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ స్టార్టైంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ రిలీజెస్ మధ్య క్లాషెస్ వస్తాయనుకుంటే చెర్రీ సంక్రాంతి రేసులోకి షిఫ్ట్ అవడంతో క్లాష్ తప్పింది. తండేల్ కూడా తప్పుకుంది. దీంతో పుష్ప 2కు గోల్డెన్ కార్పెట్ వేసినట్లయ్యింది.  టాలీవుడ్ లో మిస్ అయిన స్టార్ వార్  కన్నడ ఇండస్ట్రీలో మొదలైంది. ఉపేంద్ర వర్సెస్ కిచ్చా సుదీప్ ఫ్యాన్ మూమెంట్‌తో పాటు వార్ రెడీ అవుతోంది

Also Read : Varun Dhawan : కీర్తి సురేష్‌కు బాలీవుడ్ లో వేరే లెవల్ ఎంట్రీ

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మాక్స్‌ను డిసెంబర్ 25న  పాన్ ఇండియన్ లెవల్లో మూవీని తీసుకు వస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పుడు ఇదే క్రిస్మస్ తనకు కావాలంటున్నాడు వర్సటైట్ అండ్ కన్నడ టాప్ హీరో ఉపేంద్ర. సుదీప్ కన్నా ఐదు రోజుల ముందే ఎంట్రీ ఇచ్చేందుకు డేట్ కన్ఫమ్ చేశాడు. ఉపేంద్ర కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ యుఐ డిసెంబర్ 20న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.  జస్ట్ 5 డేస్ గ్యాప్‌తో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నారు. అది రీజనల్ లెవల్లో కాకుండా ఇండియన్ వైడ్‌గా. దీంతో థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశముందని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేనా ఫ్యాన్ వార్ పీక్స్ చేరుతుందన్న టాక్ నడుస్తోంది. ఇద్దరికి కన్నడలో భారీ ఫాలోయింగ్ ఉంది. 2040లో దేశం ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్టుతో సెటైరికల్ మూవీగా యుఐ,  మాస్ యాక్షన్ కథాంశం గా మాక్స్ తెరకెక్కాయి . మరి ఈ క్రిస్మస్ రేస్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Show comments