Cruel Love : చదువుకునే రోజుల్లో ప్రేమకు నో అన్నదని.. నాలుగేళ్ల తర్వాత వచ్చి నరికేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruel Love : ఓ ప్రేమోన్మాది వివాహితపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాలేజీ రోజుల్లో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో నాలుగేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. పూర్తి వివరాలు.. చంద్‌ఖేడాకు చెందిన 24ఏళ్ల యువతి కాలేజీలో చదువుకునే రోజుల్లో బ్యాచ్‌మేట్ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ రోజుల్లో అతనితో రిలేషన్ ను నిరాకరించినందుకు బ్యాచ్‌మేట్ తన గొంతు కోసి, పలుమార్లు కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు రిద్ధి సోని గాంధీనగర్‌లోని టీసీఎస్ లో ప్రాసెస్ అసోసియేట్‌గా పనిచేస్తోంది. ఆమె తన ఎఫ్‌ఐఆర్‌లో మాజీ బ్యాచ్‌మేట్, అస్టోడియాలోని ధాల్ ని పోల్‌లో నివాసం ఉంటున్న సర్వేష్ రావల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపింది. మంగళవారం ఉదయం అతను సడెన్ గా తన ఇంట్లో ప్రత్యక్షమయ్యాడని తెలిపింది. రావల్ వచ్చిన సమయంలో తన భర్త యష్ కూడా ఇంట్లో ఉన్నారని తెలిపింది.
Read Also: Shocking Incident : ఛీ వీళ్లు పేరెంట్సా.. బిడ్డకు విమాన టిక్కెట్ కొనాల్సి వస్తుందని..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇన్నేళ్ల తరువాత తనకు సర్ ఫ్రైజ్ ఇవ్వడానికి వచ్చినట్లు రావల్ తెలిపాడు. అంతేకాదు తన బ్యాచ్ మేట్స్ మరికొంతమంది కూడా వస్తున్నారని చెప్పాడు. దీంతో ఆమె ఇది నిజమే అని నమ్మింది. ఇన్నేళ్ల తర్వాత తన అడ్రస్ ఎలా కనుక్కున్నావని అడిగితే, మరొక ఫ్రెండ్ అడినట్లు చెప్పాడు. రావల్, రిద్దీ, యష్ లతో కాసేపు మాట్లాడాడు. ఆ తరువాత సోనీ రావల్ కు టీ పెట్టి ఇచ్చింది. మరికొంతమంది కూడా వస్తున్నారని చెప్పడంతో.. భర్తను పాలు తెమ్మని చెబితే.. అతను బైటికి వెళ్లాడు. ఆ సమయంలో సోనీ.. రావల్ తో ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లింది. అయితే రావల్ అకస్మాత్తుగా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి, జుట్టు పట్టి లాగి, గొంతు కోయడానికి ప్రయత్నించిట్లు బాధితురాలు పేర్కొంది. మెడకు అరచేయి అడ్డుపెట్టడంతో అరచేతిపై కత్తిగాట్లు పడ్డాయి. తాను గొంతు కోయనివ్వకపోవడంతో.. తన వెనుకభాగంలో చాలాసార్లు కత్తితో.. తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. మోకాళ్ల మీద కత్తితో కోశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అతని నుంచి తప్పించుకుని ఇంటి నుంచి బయటకు పరుగెత్తడంతో రావల్ పారిపోయాడు. యష్ పాల ప్యాకెట్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి, సోని తీవ్ర రక్తస్రావంతో కిందపడి కనిపించింది. వెంటనే అతను పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి.. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చంద్‌ఖేడా పోలీసులు మెడికో-లీగల్ కేసు నమోదు చేసి.. ఆ తర్వాత, రావల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!