Regina : హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తవుతూనే ఉంది. ఇంకా తన నటనను కొనసాగిస్తూనే ఉంది ఈ చెన్నై బ్యూటీ. ఈ అమ్మడు ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. తళా అజిత్ తో `విదాముయార్చి`తో పాటు.. తెలుగులో గోపీచంద్ మలినేని `జాత్`.. హిందీలో `సెక్షన్ 108`లో సన్నీ డియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో కలిసి నటిస్తోంది. అజిత్ కుమార్ చిత్రం `విదాముయార్చి` త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లోను నటిస్తోంది. రెజీనా అన్ని భాషల గురించి ఇంటర్వ్యూల్లో తన అనుభవాలను బయటపెడుతుంది. ఇటీవల సౌత్, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సారూప్యతలు, తేడాల గురించి వివరిస్తోంది. ఒక కళాకారుడు లేదా కళాకారిణి బాలీవుడ్‌లోకి ప్రవేశించినప్పుడు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇటీవల ఆమె ఓ మీడియాతో మాట్లాడింది.
Read Also:Canada Cops Beating Hindus: కెనడాలోని గుడిలో హిందువులను కొట్టిన పోలీసులు
రెజీనా ఉత్తరాదిన పని చేయాలని భావించినప్పుడు, ముంబైకి వెళ్లి నెట్‌వర్కింగ్ ఈవెంట్లకు హాజరు కావాలని ఆమెకు ఎవరో సలహా ఇచ్చారట. దక్షిణాదిలో ఈ కాన్సెప్ట్ పరిచయం లేనిది.. ఇక్కడ కాస్టింగ్ ఏజెంట్లు చాలా అరుదుగా ఉంటారు. దక్షిణాదిన నెట్‌వర్కింగ్ పీఆర్వోలు, మేనేజర్‌లే నిర్వహిస్తారు. హిందీ సినిమా చాలా పోటీ వాతావరణంలో ఉంటుందని తరచుగా స్వీయ ప్రచారానికి ప్రాధాన్యత కలిగి ఉంటుందని రెజీనా చెప్పుకొచ్చింది. నేను పని కోసం నన్ను నేను అమ్ముకునే లేదా ఏదో లాబీయింగ్ చేసే వ్యక్తిని కాదు. కానీ నేను దీన్ని చేయకపోతే అక్కడ అవకాశాన్ని పొందలేనని గ్రహించాను! అంటూ చెప్పింది. వాస్తవానికి ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఎవరైనా యాక్టివ్ గా ఉండాలి. కానీ బలవంతంగా నెట్‌వర్కింగ్‌తో యాక్టివ్ గా ఉండటాన్ని అసౌకర్యంగా భావించింది. తన తోటివారిలాగా దూకుడుగా ఉండలేనని రెజీనా పేర్కొంది.
Read Also:Karthika Masam First Monday: హరహర మహాదేవ.. శైవక్షేత్రాల్లో కార్తీక తొలి సోమవారం రద్దీ