Site icon NTV Telugu

Boy Suicide: కొత్త చెప్పులు కొనివ్వలేదని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

Chappals

Chappals

Boy Suicide: ఇటీవల కాలంలో మైనర్ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులపై అలిగి.. చిన్న చిన్న విషయాలకే తనువు చాలిస్తున్నారు. ఇష్టమైన ఫుడ్ ఇప్పించలేదని, ఫోన్ కొనివ్వలేదని, సినిమాకు డబ్బులివ్వలేదని… వంటి కారణాలతో అనేక మంది తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా కొత్త చెప్పులు కొనివ్వలేదని పదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు కొత్త చెప్పులు కావాలని తన తాతను అడిగాడు. ఆయన కొనిచ్చేందుకు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. పదేళ్ల పిల్లవాడు తన అమ్మమ్మ వాళ్లింట్లో నివసిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కాగా.. ఇద్దరూ పొరుగున్న ఉన్న గ్రామ నివాసితులని అధికారి తెలిపారు. ఆ బాలుడు అమ్మమ్మ తాతలతో కలిసి ఉంటున్నాడు.

Men Too: అమ్మాయిలు లేకుంటే ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉంటుంది మావా…

ఈ క్రమంలో సోమవారం తనకు కొత్త చెప్పులు కావాలని కోరాడు. అతని కోరికను తాత అంగీకరించలేదు. ఆ తర్వాత మనస్తాపం చెందిన బాలుడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని పోలీస్‌ అధికారి వెల్లడించారు. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లి.. బాలుడు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. దీనిపై విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు.

Exit mobile version