6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!

  • REDMI Note 17 5Gను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్
  • 6.99-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • Qualcomm Snapdragon 4 Gen 4 (4nm) ప్రాసెసర్‌తో పాటు Adreno 613 GPU ఉంది.
  • 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్.
  • 50MP AI రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో AI ఫోటోగ్రఫీ ఫీచర్లు
  • కంపెనీ 4 Android OS అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు
  • IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ డ్యూరబిలిటీ
  • ఆగస్టు 12 నుంచి Amazon ద్వారా అమ్మకాలు..
Redmi Note 17

Redmi Note 17

REDMI Note 17 5G: షావోమీ (Xiaomi) భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 17 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.99 అంగుళాల OLED డిస్‌ప్లే, 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, Qualcomm Snapdragon 4 Gen 4 ప్రాసెసర్, 50MP AI కెమెరా వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని లాంచ్ అయ్యింది. ఇంకా 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా కంపెనీ హామీ ఇచ్చింది.

OLED డిస్‌ప్లే:

REDMI Note 17 5Gలో 6.99 అంగుళాల FHD+ (2396×1080 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, DCI-P3 వైడ్ కలర్ గామట్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియోకు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉండగా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను కూడా అందించారు.

స్నాప్ డ్రాగన్ చిప్‌:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm ప్రాసెస్‌పై రూపొందిన Qualcomm Snapdragon 4 Gen 4 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ చిప్‌కు Adreno 613 GPU జతకాగా, AnTuTuలో 6.3 లక్షలకు పైగా స్కోర్ సాధించిందని కంపెనీ తెలిపింది. మల్టీటాస్కింగ్, రోజువారీ వినియోగం, గేమింగ్ సమయంలో వేడి తగ్గించేందుకు 10,416 చ.మి.మీ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ను కూడా అందించారు.

భారీ బ్యాటరీ:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. Xiaomi Surge G1 బ్యాటరీ మేనేజ్‌మెంట్ చిప్‌తో కూడిన ఈ బ్యాటరీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఉండగా, బాక్స్‌లోనే ఛార్జర్‌ను అందిస్తున్నారు. అలాగే 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా ఉపయోగించి ఇతర డివైస్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

AI కెమెరా:

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP AI మెయిన్ కెమెరాను అందించారు. AI ఆధారిత సీన్ డిటెక్షన్ టెక్నాలజీతో వివిధ పరిస్థితులకు అనుగుణంగా కెమెరా సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా మారుతాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. తక్కువ వెలుతురులో ఫోటోలు, పోర్ట్రెయిట్ మోడ్, కలర్ డైనమిక్ రేంజ్‌ను మెరుగుపరిచే AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్, డ్యూరబిలిటీ:

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. దీనికి 4 తరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ ప్రకటించింది. మెటాలిక్ మిడిల్ ఫ్రేమ్, మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‌తో ప్రీమియం డిజైన్‌ను అందించారు. అలాగే IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.

ధర:

REDMI Note 17 5G రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 6GB + 128GB ధర రూ.27,999 కాగా, 8GB + 128GB ధర రూ.30,999 గా నిర్ణయించారు. ఇక లాంచ్ ఆఫర్ కింద యాక్సిస్ బ్యాంకు, SBI, కోటక్ బ్యాంకు కార్డులతో రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించడంతో ప్రారంభ ధర రూ.24,999కు తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 12 నుంచి అమెజాన్ ద్వారా అమ్మకాలకు అందుబాటులో ఉండనుంది.

REDMI Note 17 5G ముఖ్య స్పెసిఫికేషన్స్:

డిస్‌ప్లే: 6.99-అంగుళాల FHD+ OLED, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 4 Gen 4 (4nm)
GPU: Adreno 613
RAM: 6GB / 8GB LPDDR4X
స్టోరేజ్: 128GB UFS 2.2 (మైక్రోSD ద్వారా విస్తరించుకోవచ్చు)
రియర్ కెమెరా: 50MP AI
ఫ్రంట్ కెమెరా: 8MP
ఆపరేటింగ్ సిస్టమ్: Android 16 ఆధారిత HyperOS 3
బ్యాటరీ: 8,000mAh
ఛార్జింగ్: 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్
సెక్యూరిటీ: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
రక్షణ: Corning Gorilla Glass 7i, IP65 రేటింగ్.