‘షావోమీ’ ఫోన్లలో రెడ్‌మీ నోట్ సిరీస్‌కు సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఇప్పటి వరకు రెడ్‌మీ నోట్ సిరీస్‌లో రిలీజైన వాటిలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు టెక్ ప్రియులను అలరించాయి. ఇందుకు కారణం బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లు ఉండడమే. ఇప్పుడు ఈ నోట్ సిరీస్‌లో తదుపరి ఫోన్‌లు భారత మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘రెడ్‌మీ నోట్ 14’ సిరీస్ వచ్చే నెలలో భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి.
రెడ్‌మీ నోట్ 14 సిరీస్ సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్ 14 ప్రో, రెడ్‌మీ నోట్ 14ప్రో+ మోడళ్లను రిలీజ్ చేసింది. ఈ మూడు మోడళ్లను భారత్‌లో కూడా విడుదల చేయాలని షావోమీ ప్లాన్ చేస్తోంది. లాంచ్ తేదీ ఇంకా తెలియదు కానీ.. డిసెంబర్ నెలలో భారతదేశానికి వస్తాయని తెలుస్తోంది. నోట్ 14 సిరీస్ డిసెంబర్ చివరలో లాంచ్ ఉంటుందని, 2025 జనవరి 10-15 మధ్య అమ్మకానికి అందుబాటులో ఉంటాయని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు.
Also Read: AUS vs IND: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. కెప్టెన్ బుమ్రా ఓటు ఆ ఇద్దరికే! తుది జట్టు ఇదే
చైనాలో రెడ్‌మీ నోట్ 14 ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర దాదాపు రూ.14,300 నుండి ప్రారంభమైంది. ప్రో ప్రారంభ ధర రూ.17,900 కాగా.. ప్రో+ మోడల్ ధర రూ.23,900గా ఉంది. మార్కెట్‌ను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి. 6.67 ఇంచెస్ ఓఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే,120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 6200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ నోట్ 14 సిరీస్‌లో ఉండనున్నాయి.