NTV Telugu Site icon

Redmi Buds 6 Launch: మార్కెట్‌లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌..10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేబ్యాక్‌!

Redmi Buds 6 Launch

Redmi Buds 6 Launch

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రెడ్‌మీ’ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేస్తోంది. ‘రెడ్‌మీ బడ్స్‌ 6’ను డిసెంబర్ 9న భారతదేశంలో విడుదల చేయనుంది. నోట్ 14 సిరీస్ సహా బడ్స్‌ 6ను కూడా అదే రోజున రెడ్‌మీ లాంచ్ చేయనుంది. చైనాలో గత సెప్టెంబర్‌లోనే రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌తో పాటు రెడ్‌మీ బడ్స్ 6ను విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ ఫీచర్లతో ఈ బడ్స్‌ను కంపెనీ తీసుకొస్తోంది. ఈ బడ్స్‌ ఫీచర్లు, ధర లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రెడ్‌మీ బడ్స్‌ 6ను డిసెంబర్ 9న లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఇండియా వెబ్‌సైట్ సహా అమెజాన్ మైక్రోసైట్‌ కూడా ధృవీకరించాయి. బడ్స్‌లో డ్యూయల్‌ డ్రైవర్‌లు, 12.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్, 5.5 ఎంఎం మైక్రో-పైజోఎలెక్ట్రిక్ సిరామిక్ యూనిట్‌ను ఇచ్చారు. ఇవి స్పేషియల్‌ ఆడియో టెక్నాలజీతో వస్తున్నాయి. దాంతో అద్భుత మ్యూజిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. 49 డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను ఇస్తుండగా.. క్లారిటీతో కూడిన వాయిస్ కాల్స్‌ను వినొచ్చు. ఏఐ యాంటీ-విండ్ నాయిస్ టెక్నాలజీ కారణంగా భారీగా గాలి వీచే సమయంలో కూడా స్పష్టమైన ఫోన్‌ కాల్స్‌ అనుభూతి పొందొచ్చు.

Also Read: IND vs AUS 2nd Test: టీ బ్రేక్.. స్టార్క్‌ దెబ్బకు పెవిలియన్‌కు స్టార్ బ్యాటర్లు!

డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం రెడ్‌మీ బడ్స్‌ 6లో ఐపీ54 రేటింగ్‌ను ఇస్తున్నారు. ఈ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. 10 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 42 గంటల బ్యాకప్‌ ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేబ్యాక్‌ అందిస్తుంది. బ్లూటూత్‌ 5.4కి ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో స్మార్ట్ డ్యూయల్ డివైస్ కనెక్షన్‌, రిమోట్ షట్టర్ ఫంక్షన్‌ను ఇచ్చారు. ఈ ఇయర్‌ బడ్స్ ధర రూ.2500 వేల లోపు ఉండొచ్చని అంచనా.

Show comments