Redmi Buds 6 Launch: మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్..10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేబ్యాక్!
- మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్
- డిసెంబర్ 9న భారతదేశంలో విడుదల
- కేస్‌తో కలిపి 42 గంటల బ్యాకప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రెడ్‌మీ’ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేస్తోంది. ‘రెడ్‌మీ బడ్స్ 6’ను డిసెంబర్ 9న భారతదేశంలో విడుదల చేయనుంది. నోట్ 14 సిరీస్ సహా బడ్స్ 6ను కూడా అదే రోజున రెడ్‌మీ లాంచ్ చేయనుంది. చైనాలో గత సెప్టెంబర్‌లోనే రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌తో పాటు రెడ్‌మీ బడ్స్ 6ను విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ ఫీచర్లతో ఈ బడ్స్‌ను కంపెనీ తీసుకొస్తోంది. ఈ బడ్స్ ఫీచర్లు, ధర లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రెడ్‌మీ బడ్స్ 6ను డిసెంబర్ 9న లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఇండియా వెబ్‌సైట్ సహా అమెజాన్ మైక్రోసైట్ కూడా ధృవీకరించాయి. బడ్స్‌లో డ్యూయల్ డ్రైవర్‌లు, 12.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్, 5.5 ఎంఎం మైక్రో-పైజోఎలెక్ట్రిక్ సిరామిక్ యూనిట్‌ను ఇచ్చారు. ఇవి స్పేషియల్ ఆడియో టెక్నాలజీతో వస్తున్నాయి. దాంతో అద్భుత మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. 49 డీబీ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను ఇస్తుండగా.. క్లారిటీతో కూడిన వాయిస్ కాల్స్‌ను వినొచ్చు. ఏఐ యాంటీ-విండ్ నాయిస్ టెక్నాలజీ కారణంగా భారీగా గాలి వీచే సమయంలో కూడా స్పష్టమైన ఫోన్ కాల్స్ అనుభూతి పొందొచ్చు.
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Also Read: IND vs AUS 2nd Test: టీ బ్రేక్.. స్టార్క్ దెబ్బకు పెవిలియన్‌కు స్టార్ బ్యాటర్లు!
డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం రెడ్‌మీ బడ్స్ 6లో ఐపీ54 రేటింగ్‌ను ఇస్తున్నారు. ఈ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 10 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 42 గంటల బ్యాకప్ ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. బ్లూటూత్ 5.4కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్మార్ట్ డ్యూయల్ డివైస్ కనెక్షన్, రిమోట్ షట్టర్ ఫంక్షన్‌ను ఇచ్చారు. ఈ ఇయర్ బడ్స్ ధర రూ.2500 వేల లోపు ఉండొచ్చని అంచనా.
తాజావార్తలు
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!