Redmi 14C: స్మార్ట్‌ఫోన్ లకు భారత మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండనే ఉంటుంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, బడ్జెట్ రేంజ్ ఫోన్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన ఉంటుంది. ఈ పరిస్థితికి అనుగుణంగా రెడ్‌మి సంస్థ శుక్రవారం నాటి నుండి రూ.10,000 కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఫీచర్లను అందించటంతో పాటు తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్ పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ బడ్జెట్ వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తుంది. రూ.9,999 ధరతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ అవసరాలకు అనువైన ఆప్షన్ గా ఇది మార్కెట్‌లో దూసుకుపోనుంది. రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌ను షియోమీ రిటైల్ అవుట్ లెట్లు, Mi అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Also Read: Mahindra XUV 3XO: వామ్మో.. ఆ కారు కావాలంటే ఏడాది కాలం ఆగాల్సిందేనా?
ఇక ఈ మొబైల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. TUV Rheinland సర్టిఫికేషన్ పొందిన ఈ డిస్‌ప్లే ప్రీమియం స్టార్‌లైట్ డిజైన్‌తో అబ్బురపరుస్తుంది. రెడ్‌మి 14C 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC చిప్‌సెట్ ఉపయోగించారు. ఇక ప్రాసెసర్, స్టోరేజీ విషయానికి వస్తే.. 6GB వర్చువల్ ర్యామ్‌తో కలిపి 12GB వరకు ర్యామ్ ను పొడిగించవచ్చు. మైక్రో SD కార్డు ద్వారా దీనిని 1TB వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS ను కలిగి ఉంది. రెడ్‌మి సంస్థ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనుంది.
Also Read: Darling : ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనట
ఇక మొబైల్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా బ్యూటీ మోడ్‌తో అందించబడింది. ఇక ధరల విషయానికి వస్తే.. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ రూ.9,999గా, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.10,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.11,999గా నిర్ణయించారు. ఈ మొబైల్ స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్ గేజ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ లో IP52 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్, 3.5mm ఆడియో జాక్ లాంటి ఇతర ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.