Sandalwood Smuggling: లగేజీ ముసుగులో అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న ముఠా ఆట కట్టించారు ఏపీ పోలీసులు. తిరుపతి జిల్లాలో రెండు కోట్లు విలువ చేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీఫక్కీలో 21 కిలోమీటర్లు చేజింగ్ చేసి 44 మంది కూలీలను అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని.. ఎంతటివారినైనా ఉపేక్షించేంది లేదని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి వెల్లడించారు. చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు.
CM YS Jagan Great Heart: బాలుడి పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే సాయం..
ఇద్దరు బడా స్మగ్లర్స్ పోలీసుల నుంచి పరారీ అయినట్లు పోలీసులు వెల్లడించారు. వారు తిరువన్నమలై, వేలూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీల నుంచి 11 గొడ్డళ్లు, 32 రంపాలు, ఒక అశోక్ లేలాండ్ లారీ, మారుతీ డిజైర్, భారత్ బెంజ్ లారీని స్వాధీనం చేసుకున్నారు. 2,632 కిలోల బరువు గల 81 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. త్వరలో ఎర్రచందనం కింగ్ పిన్స్‌ను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పోలీసు సిబ్బంది ఎంతో ధైర్య సాహసాలతో కూలీలను పట్టుకున్నారని ఎస్పీ ప్రశంసించారు. ఇందులో సత్యనారాయణ, స్వామి నాధన్‌లు ప్రధాన ముద్దాయీలని తెలిపారు.
