లగేజీ ముసుగులో అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న ముఠా ఆట కట్టించారు ఏపీ పోలీసులు. తిరుపతి జిల్లాలో రెండు కోట్లు విలువ చేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీఫక్కీలో 21 కిలోమీటర్లు చేజింగ్ చేసి 44 మంది కూలీలను అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.