NTV Telugu Site icon

Red Sandal Smugglers: రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు.. వాహనంతో ఢీకొట్టి కానిస్టేబుల్ హత్య

Red Sandal Smugglers

Red Sandal Smugglers

Red Sandal Smugglers: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద పోలీసు సిబ్బంది కాపు కాశారు. ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల తనిఖీలను గుర్తించి వేగంగా వారిని ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎర్రచందనం వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో ఎర్రచందన స్పగ్లర్లు అతడిని ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనలో టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల్ని ఢీకొట్టి పారిపోతున్న స్మగ్లర్లను పోలీసులు వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనంలో ఏడు ఎర్ర చందనం దుంగలను గుర్తించారు. వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబరు ఉన్న వాహనంలో శేషాచలం అడవుల్లో చెట్లను నరికి దుంగలను తరిస్తున్నట్లు గుర్తించారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ దగ్గర ఈ ఘటన జరిగింది.

Read Also: Purandeswari: ఏపీలో పవన్‌కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వేగంగా వాహనం నడిపి తప్పించుకోడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు విచారం వ్యక్తం చేశారు.
మృతి చెందిన కానిస్టేబుల్ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 2013 బ్యాచ్ కానిస్టేబుల్ గణేష్, 14వ బెటాలియన్‌‌లో పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం గణేష్ డిప్యుటేషన్ పై యాంటీ స్మగ్లర్ టాస్క్ ఫోర్స్‌కు వచ్చాడని సహచరులు చెబుతున్నారు. కానిస్టేబుల్‌ మృతితో అతని కుటుంబసభ్యులు తీవ్రంగా విలపించారు. కానిస్టేబుల్‌ గణేష్‌కు భార్య అనూష, ఇద్దరు పిల్లలు రాజ్ కిశోర్ (6) వేదాన్ష్ (3) ఉన్నారు. కేవీ పల్లి మండలం గుండ్రేవారిపల్లి ఘటనా స్థలానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు చేరుకుని పరిశీలించారు.