NTV Telugu Site icon

Hyderabad: తలసాని శ్రీనివాస్ ఇంట్లో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్..

Brs

Brs

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గ్రేటర్ పరిధిలో పార్టీ కార్యకలాపాలతో పాటు మేయర్ పై అవిశ్వాసం తదితర అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.

Read Also: Kollu Ravindra: విశాఖ ఉక్కును కాపాడింది సీఎం చంద్రబాబు!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో తమకున్న కార్పొరేటర్ల సంఖ్యతో పాటు అవిశ్వాసం పెట్టేందుకు ఎంత సంఖ్య అవసరం అనే కోణంలో చర్చిస్తున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులు మినహా మిగతా సంఖ్యా సభ్యులను ఎలా సమకూర్చుకోవాలనే అంశాలపై సమావేశం కొనసాగుతుంది.

Read Also: Kalyan Jewellers : కేవలం 21రోజుల్లో రూ.31వేల కోట్లు నష్టపోయిన కళ్యాణ్ జ్యువెలర్స్.. ఎందుకిలా జరిగింది ?