GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- భారత మార్కెట్లో కొత్తగా Realme Watch S5 స్మార్ట్‌వాచ్ విడుదల
- 1.43 అంగుళాల AMOLED డిస్ప్లేతో ఆకర్షణీయమైన డిజైన్
- 5ATM వాటర్ రెసిస్టెన్స్‌తో నీటిలోనూ వినియోగానికి అనుకూలం
- 460mAh బ్యాటరీతో గరిష్టంగా 20 రోజుల బ్యాటరీ బ్యాకప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme Watch S5 Launch: రియల్మీ సంస్థ భారత మార్కెట్లో కొత్తగా Realme Watch S5 స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అధునాతన ఫిట్నెస్ ఫీచర్లను అందిస్తూ ఈ స్మార్ట్ వాచ్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా AMOLED డిస్ప్లే, GPS సపోర్ట్, 5ATM వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు దీనికి ప్రత్యేకంగా నిలువలున్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.43 అంగుళాల AMOLED డిస్ప్లేను అందించారు. 466×466 పిక్సెల్స్ రిజల్యూషన్, 302 PPI పిక్సెల్ డెన్సిటీ, 79 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో స్పష్టమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
డిజైన్ పరంగా.. అల్యూమినియం అల్లాయ్ డయల్‌తో పాటు పాండా గ్లాస్ రక్షణను కల్పించారు. స్ట్రాప్‌తో కలిపి వాచ్ బరువు సుమారు 49.63 గ్రాములు మాత్రమే ఉండటంతో దీన్ని సులభంగా ధరించవచ్చు. 22mm రిమూవబుల్ సిలికా జెల్ స్ట్రాప్లను అందించగా, రాక్ గ్రే, సాండ్ వైట్ రంగుల్లో ఈ వాచ్ లభించనుంది. ఫిట్నెస్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని ఈ వాచ్‌లో 110కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు. సొంత GPS సపోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఐదు శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థలకు ఇది అనుకూలంగా పనిచేస్తుంది. రన్నింగ్ కోర్సులు, స్ట్రెచింగ్ గైడ్స్, VO2 మ్యాక్స్ ట్రాకింగ్, ఏరోబిక్ ట్రైనింగ్ ఎఫెక్ట్ అనాలిసిస్, రికవరీ టైమ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఫిట్నెస్ ట్రాకింగ్‌ను మరింత సమర్థవంతంగా మారుస్తాయి.
Also Read
ఇక ఆరోగ్య పరిరక్షణ ఫీచర్లలో భాగంగా హార్ట్ రేట్ మానిటరింగ్, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి (SpO2), నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయి, శబ్ద స్థాయి వంటి అంశాలను ట్రాక్ చేసే సదుపాయం ఉంది.కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే బ్లూటూత్ కాలింగ్, BT ఇంటర్‌కామ్, మెసేజ్ నోటిఫికేషన్లు, వాతావరణ సమాచారం, అలారం, స్టాప్‌వాచ్, కాలిక్యులేటర్, క్లౌడ్ వాచ్ ఫేస్‌లు వంటి అనేక స్మార్ట్ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. అలాగే Always-On Display సపోర్ట్ కూడా ఉంది.
బ్యాటరీ పరంగా 460mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో 16 రోజుల వరకు, లైట్ స్మార్ట్ మోడ్‌లో గరిష్టంగా 20 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సుమారు 2.5 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ధర విషయానికి వస్తే ధరను భారత మార్కెట్లో రూ. 7,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ. 500 తగ్గింపుతో రూ. 7,499కే కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ ఆఫర్ జూన్ 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 7 రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
- Tags
- Realme Watch S5
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!