Realme 14 Pro Series: మొబైల్ రంగంలో అగ్రగామి ఉన్న కంపెనీ కంపెనీలలో రియల్‌మి ఒకటి. తాజాగా భారత మార్కెట్‌లోకి రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. అవే రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్. వినియోగదారులను ఆకట్టుకునేలా కలర్ ఛేంజింగ్ వెర్షన్‌తో లాంచ్ చేసిన ఈ ఫోన్లు, ఆధునిక ట్రిపుల్ ఫ్లాష్ యూనిట్, 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో పనిచేస్తాయి. ఈ ఫోన్లకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్ జనవరి 23 మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌కు అందుబాటులోకి రానుంది. రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లతో పాటు వివిధ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్లు లభ్యమవుతాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
Also Read: SpaceX Starship destroyed: పేలిన స్టార్‌షిష్ రాకెట్.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో
ఇక రియల్‌మి 14 ప్రో 5G మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. రియల్‌మి 14 ప్రో మోడల్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే తో విడుదలైంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7i రక్షణను కలిగి ఉండటం విశేషం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ పై ఆధారపడి పనిచేస్తుంది. 8GB ర్యామ్, 128GB లేదా 256GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. కెమెరా విభాగంలో 50MP సోనీ IMX882 ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు ఇంకా Hi-Res ఆడియో సర్టిఫికేషన్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: Maharashtra: షిర్డీలో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మృతి
మరోవైపు రియల్‌మి 14 ప్రో ప్లస్ 5G ఫీచర్ల విషయానికి వస్తే.. రియల్‌మి 14 ప్రో ప్లస్ మోడల్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే తో లాంచ్ అయింది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 1500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ పై ఆధారపడి పని చేస్తుంది. 8GB/12GB ర్యామ్, 128GB/256GB స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. కెమెరా విభాగంలో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు OIS సపోర్ట్, 3X ఆప్టికల్ జూమ్, 6X లాస్‌లెస్ జూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లతో పాటు IP66+IP68+IP69 రేటింగ్ కలిగి ఉంది.
ఇక ఈ మొబైల్స్ ధరల విషయానికి వస్తే..
రియల్‌మి 14 ప్రో 5G:
8GB ర్యామ్ + 128GB స్టోరేజీ: రూ. 24,999
8GB ర్యామ్ + 256GB స్టోరేజీ: రూ. 26,999
రియల్‌మి 14 ప్రో ప్లస్ 5G:
8GB ర్యామ్ + 128GB స్టోరేజీ: రూ. 29,999
8GB ర్యామ్ + 256GB స్టోరేజీ: రూ. 31,999
12GB ర్యామ్ + 256GB స్టోరేజీ: రూ. 34,999.