Site icon NTV Telugu

120X జూమ్, 7000mAh బ్యాటరీ, 200MP టెలిఫోటో, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ లతో Realme GT8 Pro లాంచ్..!

Realme Gt8 Pro

Realme Gt8 Pro

Realme GT8 Pro: రియల్‌మీ భారత మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ realme GT 8 Pro ను అధికారికంగా విడుదల చేసింది. డిజైన్, డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ ఇలా ప్రతి విభాగంలోనూ ఈ ఫోన్ అత్యుత్తమ స్థాయి ఫీచర్లతో మార్కెట్‌లో సత్తా చాటనుంది. ముఖ్యంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్న 2K 144Hz హైపర్ గలౌ డిస్ప్లే హైలెట్ కానున్నాయి. మరి ఈ అద్భుత మొబైల్ లో ఏ ఫీచర్లు ఉన్నాయో వివరంగా చూసేద్దామా..

అద్భుతమైన డిస్ప్లే అండ్ డిజైన్:
రియల్‌మీ GT 8 ప్రోలో 6.79 అంగుళాల 2K+ OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 3200Hz ఇన్‌స్టాంట్ టచ్ సాంప్లింగ్ రేట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. డాల్బి విజన్ సపోర్ట్, హార్డ్‌వేర్-లెవల్ DC డిమ్మింగ్ వంటి లక్షణాలు విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ఫోన్‌లో తొలి సారిగా స్విట్చబుల్ కెమెరా బంప్ టెక్నాలజీను ప్రవేశపెట్టారు. దీనితో వినియోగదారుడు రౌండ్, స్క్వేర్, రోబోట్ థీమ్ వంటి కెమెరా మాడ్యూల్స్‌ను తన ఇష్టానుసారం మార్చుకోవచ్చు.

ఒక్కసారి చార్జ్ చేస్తే 22 రోజుల స్టాండ్ బై లైఫ్‌, 50MP సోనీ కెమెరాతో వచ్చేసిన Wobble One స్మార్ట్‌ఫోన్..!

అత్యాధునిక ప్రాసెసర్:
పనితీరు పరంగా ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉపయోగించారు. అలాగే ఇందులో 16GB LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ లభ్యం అవుతుంది. ఇక ఇంధువైలో ప్రత్యేకంగా 7000mm² VC కూలింగ్ సిస్టమ్ ను చరిత్రలోనే అతిపెద్దదిగా రియల్‌మీ వినియోగించింది. ఇక ‘AI గేమింగ్ సూపర్ ఫ్రేమ్’ టెక్నాలజీతో MLBB ను 144Hz లో, BGMI ను 120Hz లో కూడా 35°C ఉష్ణోగ్రత వద్ద సాఫీగానే రన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

కెమెరా విభాగం:
రియల్‌మీ GT 8 ప్రో రికో ఇమేజింగ్ కంపెనీతో కలిసి రూపుదిద్దుకున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. రికో GR సిరీస్ నుండి పొందిన టెక్నాలజీతో ఈ ఫోన్ కెమెరా సెటప్ మరింత శక్తివంతమైంది. ఇందులో 200MP 3x పెరిస్కోప్ టెలిఫోటో (Samsung HP5) 12X లాస్‌లెస్ జూమ్, 120X హైబ్రిడ్ జూమ్ కలిగి ఉంది. అలాగే 50MP ప్రధాన కెమెరా 1/1.56” సెన్సార్, Ricoh GR యాంటీ-గ్లర్ లెన్స్, OIS, 50MP 116° అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. అలాగే వీటిలో 4K 120fps Dolby Vision, 8K 30fps రికార్డింగ్, 4K 120fps 10-bit Log వీడియో రికార్డింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో భారీ సామర్థ్యం గల 7000mAh టైటన్ బ్యాటరీ ను అమర్చారు. ఇందులో 120W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఫోన్‌ను 0 నుంచి 100% వరకు కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్ ద్వారా 15 నిమిషాల్లో 50% ఛార్జ్ పొందవచ్చు.

సాఫ్ట్‌వేర్ & ఇతర ఫీచర్లు:
రియల్‌మీ GT 8 ప్రో Android 16 ఆధారిత realme UI 7.0 పై నడుస్తుంది. ఇక కంపెనీ 4 సంవత్సరాల OS అప్డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని వెల్లడించింది. అల్ట్రా హాప్టిక్ మోటార్, సిమ్మెట్రీక్ మాస్టర్ ఎకౌస్టిక్ స్పీకర్, IP66 + IP68 + IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తాయి.

CM Revanth: సీఎంను కలిసిన Analog AI CEO అలెక్స్ కిప్‌మాన్.. రాష్ట్రాభివృద్ధిపై చర్చలు..!

రియల్‌మీ GT 8 ప్రో డ్రీమ్ ఎడిషన్:
రియల్‌మీ GT 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ Aston Martin Aramco F1 టీమ్‌తో కలిసి రూపొందించిన ప్రత్యేక ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా వచ్చింది. ఈ ఎడిషన్‌లో Aston Martin Racing Green అనే ప్రత్యేక రంగుతో పాటు Lime Essence యాక్సెంట్ డిజైన్‌ను అందించడం దీన్ని మరింత ప్రీమియం, విభిన్నంగా నిలబెడుతోంది. అలాగే ప్రత్యేకమైన F1-థీమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, AMR25 డైనమిక్ వాల్‌పేపర్, GT Mode ట్రాక్ సౌండ్ వంటి రేసింగ్-ఇన్‌స్పైర్డ్ ఎలిమెంట్లు ఈ ఎడిషన్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి.

ధరలు:
ధరల విషయానికి వస్తే రియల్‌మీ GT 8 ప్రో డ్రీమ్ ఎడిషన్ 16GB+512GB వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించబడింది. సాధారణ మోడళ్లలో 12GB+256GB వేరియంట్ రూ.72,999 ధరతో, రూ. 5000 బ్యాంక్ ఆఫర్, 6 నెలల EMI, అలాగే ఉచిత డెకో సెట్ తో కలిపి రూ.67,999కు లభిస్తుంది. 16GB+512GB వేరియంట్ రూ.73,999కి లభిస్తుంది. అలాగే ICICI, HDFC, SBI వంటి బ్యాంకులపై ప్రత్యేక ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కూడా HDFC, AXIS, KOTAK, OneCard, DBS, BOB, AU, J&K, Scapia వంటి బ్యాంకులపై EMI ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. SBI, ICICI బ్యాంకులతో పూర్తి మొత్తం స్వైప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రియల్‌మీ GT 8 ప్రో మరియు దాని డ్రీమ్ ఎడిషన్ మోడళ్లు సమీప రిటైల్ స్టోర్లతో పాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version