Site icon NTV Telugu

Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

Realme Buds

Realme Buds

Realme Buds T200x: రియల్‌మీ తన కొత్త ట్రూ వైర్‌లెస్ ఎయిర్‌బడ్స్ Buds T200x ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త ఎయిర్‌బడ్స్ రియల్‌మీ C73 5G స్మార్ట్‌ఫోన్ తో పాటు లాంచ్ అయ్యాయి. Buds T200xలో 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్ ఉండటంతో ఇదివరకు మోడల్ కన్నా 24% మెరుగైన క్వాలిటీ అనుభవం అందుతుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్‌ లో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ కలిగిన వాటితోపాటు, రియల్‌మీ లింక్ యాప్ ద్వారా అనేక ఇక్వలైజర్ (EQ) మోడ్‌లు, కస్టమైజేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. Buds T200xలో 25 డిసిబెల్స్ (dB) వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) ఫీచర్ ఉంది. ఇది ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్లు ఉపయోగించి పక్కనున్న శబ్దాలను తగ్గించి వినిపించే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

Read Also: Tata Altroz Facelift: బుకింగ్స్ ఓపెన్.. కేవలం రూ.21,000తో ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ సొంతం చేసుకోండి..!

ఇక ఫోన్ కాల్స్ కోసం ఈ ఎయిర్‌బడ్స్‌లో క్వాడ్-మైక్ AI డీప్ కాల్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఇది రెండింతల మైక్రోఫోన్లతో పాటు అభివృద్ధి చెందిన DNN వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి స్పష్టమైన వాయిస్ కమ్యూనికేషన్ అందిస్తుంది. ఇక ఇందులో బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే.. Buds T200x గత మోడల్‌ కంటే 26% ఎక్కువ ప్లేబ్యాక్ టైం ఇస్తాయి. ANC ఆఫ్ చేస్తే 7 గంటల వరకు ప్లేబ్యాక్ మొత్తం 48 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ANC ఆన్ చేస్తే 5 గంటల పాటు వినిపించగలుగుతాయి. ఫుల్ ఛార్జింగ్ USB Type-C ద్వారా సుమారు 120 నిమిషాల్లో పూర్తవుతుంది.

ఇతర ముఖ్యమైన ఫీచర్ల పరంగా చూస్తే.. వీటికి IP55 రేటింగ్‌తో నీటి, ధూళి నిరోధకత, 45 మిల్లీసెకన్ల అల్ట్రా-లో లేటెన్సీ గేమింగ్ మోడ్, డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ (ఆండ్రాయిడ్), అలాగే టచ్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్లేబ్యాక్, కాల్స్, ANC ఇంకా ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ల మధ్య సులభంగా మార్పిడికి సహాయపడతాయి.

Read Also: Toyota: మెరుగైన మైలేజ్, అధునాతన పనితీరుతో కొత్త ఫార్చ్యూనర్, లెజెండర్ నియో వేరియంట్లు విడుదల..!

ఈ రియల్‌మీ Buds T200x మూన్‌లైట్ వైట్, ఫ్రోస్ట్ బ్లూ, ప్యూర్ బ్లాక్ వంటి మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 1,599 గా ఉంది. అయితే లాంచ్ కింద బ్యాంక్ ఆఫర్‌తో రూ. 1,399 కి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఎయిర్‌బడ్స్ జూన్ 13, 2025 నుండి రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌ కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.

Exit mobile version