NTV Telugu Site icon

Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్ ఛేంజర్ ?

New Project (29)

New Project (29)

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ తనకి మంచి కం బ్యాక్ లా నిలుస్తుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా ఈ సినిమాపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది.

Read Also:Patnam Narender Reddy: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..

దీని ప్రకారం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పలు రూమర్స్ ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా ఏపీలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఈ గ్రాండ్ ఈవెంటుకు పవన్ కళ్యాణ్ కూడా హాజరైతే నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ అవుతుందని చెప్పవచ్చు. శంకర్ సినిమాల తాలూకా ఈవెంట్ లు ఏ లెవెల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో జరిగిన ఈవెంట్లను చూస్తే అర్థం అవుతుంది. ఇది తనకి తెలుగులో మొదటి సినిమా కావడంతో ఇది మరింత స్పెషల్ గా కూడా ఉండనుందని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరు అవుతాడో లేదో.

Read Also:PL 2025 Auction: డబ్బు మ్యాటర్ కాదు.. ఢిల్లీని వీడటంపై స్పందించిన పంత్!

Show comments