Site icon NTV Telugu

GST : పెళ్లిళ్ల సీజన్ లో కేంద్రం షాక్.. బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులపై 28శాతం జీఎస్టీ

New Project (9)

New Project (9)

GST : పెళ్లిళ్ల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నుండి షాక్ ఉండవచ్చు, వాస్తవానికి డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది. బ్రాండెడ్ దుస్తులపై జీఎస్టీ పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒక వేళ మీరు గనుక పెళ్లి ఫిక్స్ చేసుకున్నట్లు అయితే డిసెంబర్ నెలకు ముందే షాపింగ్ చేయడం మంచింది. ఆ తర్వాత పెళ్లి బట్టలు కొనాలంటే కాస్ట్లీగా మారనున్నాయి. ప్రస్తుతం, రెడీమేడ్ దుస్తులపై నాలుగు శ్లాబ్‌లలో జీఎస్టీ వేర్వేరుగా వసూలు చేయబడుతోంది. ఇందులో పన్ను 5 నుండి 28 శాతం వరకు ఉంటుంది. డిసెంబర్ 21న జరిగే సమావేశం తర్వాత మంత్రుల బృందం (జిఓఎం) బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలపై పన్ను వసూళ్లను పెంచే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 4 శ్లాబులుగా చేసినప్పటికీ, రెడీమేడ్ దుస్తులపై మాత్రం మూడు శ్లాబుల్లో జీఎస్టీ వర్తిస్తుంది. రూ. 1,500 వరకు ఉన్న దుస్తులపై 5శాతం జీఎస్టీ, రూ. 1,500-10,000 మధ్య బట్టలపై 18శాతం జీఎస్టీ, రూ. 10,000 కంటే ఎక్కువ ఉన్న దుస్తులపై 28శాతం జీఎస్టీ విధించబడుతుంది. ప్రస్తుతం, మూడు స్లాబ్‌లలో రెడీమేడ్ దుస్తులపై జిఎస్‌టి వర్తిస్తుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 21వ తేదీన జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రుల బృందం రెడీమేడ్ దుస్తులపై పన్ను శ్లాబును పెంచే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 5 శాతం పన్ను స్లాబ్‌ను తొలగించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 21 తర్వాత రెడీమేడ్ దుస్తులపై 18 శాతం, 28 శాతం జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Read Also:World Richest Cricketer: 2019లో రిటైర్మెంట్.. ఇప్పుడు వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్‌! ఏకంగా 70 వేల కోట్లు

బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ
ప్రస్తుతం బట్టల ధరలను బట్టి మూడు శ్లాబులుగా ప్రభుత్వం బట్టలపై జీఎస్టీని వసూలు చేస్తోంది, అయితే డిసెంబర్ 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం బ్రాండెడ్ దుస్తులను 28 శాతం శ్లాబ్‌లో ఉంచవచ్చు, ఆ తర్వాత బ్రాండెడ్ దుస్తులు మునుపటి కంటే ఖరీదైనది అవుతుంది.

148 వస్తువులు ఖరీదైనవి కావచ్చు
148 వస్తువులపై జీఎస్టీ రేట్లలో మార్పులను మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించగా, జీఎస్టీ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. మంత్రుల బృందం నివేదికపై డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారు.

Read Also:Eknath Shinde: ఆందోళనకరంగా ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

Exit mobile version