NTV Telugu Site icon

MLA KP Nagarjuna Reddy: మార్కాపురం ప్రజల రుణాన్ని తీర్చుకోలేను.. గిద్దలూరులో పోటీకి రెడీ

Kp Nagarjuna Reddy

Kp Nagarjuna Reddy

MLA KP Nagarjuna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి.. కొందరు సిట్టింగ్‌లకు మొండి చేయి ఇచ్చింది అధిష్టానం.. మరికొందరికి స్థానాలను మార్చింది.. ఈ నేపథ్యంలోనే.. మార్కాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేపీ నాగార్జునరెడ్డిని గిద్దలూరు అసెంబ్లీకి పంపాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, వైసీపీ అధినేత, సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించిన కేపీ నాగార్జున రెడ్డి.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం జగన్‌ తనకు సువర్ణ అవకాశం ఇచ్చారని, ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Read Also: Vivek Taneja: వాషింగ్ట‌న్‌లో దాడి.. మృతిచెందిన భారత సంతతి వ్యాపారవేత్త!

తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి.. తన తండ్రి కేపీ కొండారెడ్డి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నారని.. మూడు దఫాలుగా సమితి ప్రెసిడెంట్‌గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు.. తన మామ ఉడుముల శ్రీనివాసుల రెడ్డి కంభం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేయడంతో 2019లో సీఎం వైఎస్‌ జగన్‌ తనకు మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, వారికి జగనన్న మీద ఉన్న అభిమానంతో తనను 18,600 మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపారన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్దికి ఎంతో కృషి చేశా.. సీఎం జగన్‌ సహకారంతో మార్కాపురానికి మెడికల్‌ కాలేజీ, షాదీఖానా, బీసీభవన్‌, అంబేద్కర్‌ భవన్‌, పొదిలి పెద్దచెరువు అభివృద్ధి, మార్కాపురానికి రెండో ఫేజ్‌ నీటి సరఫరా పథకం తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టానని వెల్లడించారు.. ఇక, శాశ్వతంగా కరువును నివారించే వెలిగొండ ప్రాజెక్టు కూడా పూర్తైందన్నారు. ఐదేళ్లలో తాను ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి గడప గడపకు మన ప్రభుత్వం, వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ, సామాజిక సాధికార బస్సుయాత్ర తదితర కార్యక్రమాలన్నీ సమర్ధవంతంగా నిర్వహించాననీ, ప్రజల ఆదరణ, అభిమానాన్ని తాను ఎన్నడూ మర్చిపోలేనన్నారు. ఇవి కాకుండా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం.. అందరి సహకారంతోనే మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగాను.. అందరికీ పేరుపేరునా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కేపీ నాగార్జున రెడ్డి.. ఇక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనను సీఎం వైఎస్‌ జగన్‌.. గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తూ సువర్ణ అవకాశం కల్పించారని, ఆయనకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. గిద్దలూరు కూడా పశ్చిమ ప్రకాశంలో భాగమేనన్నారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో జగనన్న సహకారంతో అభివృద్ధి చేస్తానని, ఆ ప్రాంత ప్రజలకు సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి.

Show comments