Re Release : న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెబుతున్న రీ రిలీజ్ సినిమాలు
- టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్
- జనవరి 1 థియేటర్ లోకి మూడు సినిమాలు
- 1996లో వచ్చిన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Re Release : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల పరంపర కొనసాగుతోంది. తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు, స్పెషల్ డేల సందర్భంగా.. వారు నటించిన హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించాయి. రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ ఇంకా నడుస్తోంది. తమ అభిమాన చిత్రాలను రీ-రిలీజ్ చేస్తూ అభిమానులు థియేటర్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ రీ-రిలీజ్ చిత్రాలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో, స్టార్స్ అందరూ తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే, మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాలీవుడ్లో కొన్ని రీ-రిలీజ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి.
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
- Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
వాటిలో ముఖ్యంగా 1996లో మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ ‘హిట్లర్’.. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను జనవరి 1న రీ-రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు మెగా ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్పోర్స్ట్ డ్రామా మూవీ ‘సై’ టాలీవుడ్‌కి రగ్బీ ఆట అంటే ఏంటో పరిచయం చేసింది. నితిన్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా కూడా జనవరి 1న రీ-రిలీజ్ కానుంది.
Read Also:Manmohan Singh: శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..
ఈ రెండు సినిమాలతో పాటు లవర్ బోయ్ హీరో సిద్ధార్థ్, షామిలి నటించిన క్లాసిక్ లవ్‌స్టోరీ ‘ఓయ్’ మూవీ కూడా రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ్ కాగా, దీనికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు రెండోసారి ‘ఓయ్’ మూవీ రీ-రిలీజ్ అవుతుంది. మరి ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వస్తున్న ఈ మూడు చిత్రాలు రీ-రిలీజ్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయనేది చూడాలి.
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!