NTV Telugu Site icon

Ambati Rambabu: ఆ ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీ- పోలింగ్ చేయాల్సిందే..!

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి.. మళ్లీ ముఖ్యమంత్రి జగన్ కి అధికారం ఇవ్వాలా లేదా 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబుకు అధికారం ఇవ్వాలా అనే విధంగా ఎన్నికలు జరిగాయి.. వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలి వచ్చారని పేర్కొన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వికలాంగులు, వృద్ధులు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. బడుగు బలహీన వర్గాలు బాధ్యతతో ఓటు వేశారు.. 70 శాతం మహిళలు జగన్ కే ఓటు వేశారు.. ముఖ్యమంత్రి జగన్ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు అని మంత్రి అంబటి రాబాబు వెల్లడించారు.

Read Also: TDP vs YCP Fight: జమ్మలమడుగులో వైసీపీ- టీడీపీ- బీజేపీ నాయకులు రాళ్లతో దాడి

కాగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలు ఓటు వేశారని అంబటి రాంబాబు చెప్పారు. ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు మళ్లీ జగనన్ను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.. టీడీపీ కూడా మేము గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు.. అలాగే, పల్నాడు ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా దాడులు చేశారు.. ఎన్నికల సంఘం లా అండ్ ఆర్డర్ కాపాడాలని డీజీపీ, ఐజీతో పాటు పోలీసులు అందర్నీ మార్చారు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్ని మార్పులు జరిగినా కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు అని ఆరోపించారు. పోలీసులు ఎందుకు స్పందించలేదు సినిమాల్లో లేటుగా వెళ్లినట్టు గొడవలు జరిగిన ప్రదేశాలకు వెళ్లారు.. టీడీపీతో కుమ్మక్కయి పోలీసులు ఫెయిల్ అయ్యారు.. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. నా ప్రత్యర్థి మాత్రం అన్ని పోలింగ్ బూతులు సందర్శించాడు అని అంబటి రాంబాబు తెలిపారు.

Read Also: Tabu-Dune Prophecy: హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో ‘టబు’!

ఇక, సత్తనపల్లి నియోజకవర్గంలో రూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కుమ్మక్కయ్యాడు అని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పక్క ప్లాన్ ప్రకారం పోలీసులు విధులు నిర్వహించారు.. పోలీసుల ప్రోత్బడంతో టీడీపీ వారు నా అల్లుడిపై దాడి చేశారు.. అలాగే, అనేక గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.. నియోజకవర్గంలో ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీ- పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ విచారించి నిర్ణయం తీసుకోవాలి.. చంద్రబాబు మోసగాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా చెత్తబుట్టలో వేశాడు.. జగన్ మొనగాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు.. మోసగాడు కావాలో మొనగాడు కావాలో ప్రజలే నిర్ణయిస్తారంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.