Honda CB750 Hornet: కలర్ TFT డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ఇంజన్, ఆధునిక ఫీచర్లతో హోండా CB750 హార్నెట్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda CB750 Hornet: హోండా మోటార్ సైకిల్స్ తన నూతన మిడిల్వెయిట్ నేకెడ్ బైక్ CB750 హార్నెట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ హోండా CB750 హార్నెట్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మస్క్యులర్ ట్యాంక్ ష్రౌడ్స్‌తో కూడిన షార్ప్ బాడీ వర్క్‌తో ఆకట్టుకుంటుంది. పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ బైక్ మ్యాట్ పియర్ల్ గ్లేర్ వైట్, మ్యాట్ బాలిస్టిక్ బ్లాక్ మెటాలిక్ రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
Read Also: RCB vs SRH: టాప్ ప్లేస్ పై కన్నేసిన ఆర్సీబీ.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్..!
Also Read
ఇంజిన్, పెర్ఫార్మెన్స్:
ఈ బైక్‌లో 755cc ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 90.52bhp పవర్‌ను @9,500rpm, 75Nm టార్క్‌ను @7,250rpm ఉత్పత్తి చేస్తుంది. 270-డిగ్రీ క్రాంక్ తో ఉండటం వలన దాని సౌండ్, రైడింగ్ ఫీలింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్టు అండ్ స్లిపర్ క్లచ్ సౌకర్యం ఉంది.

సస్పెన్షన్, బ్రేకింగ్:
బైక్ ముందు భాగంలో Showa SFF-BP యూప్‌సైడ్ డౌన్ ఫోర్క్, రియర్‌లో లింక్డ్ మోనోషాక్ ఇవ్వబడింది. బ్రేకింగ్ కోసం డ్యూయల్ 296mm ఫ్రంట్ డిస్కులు, 240mm రియర్ డిస్క్ అందుబాటులో ఉండగా.. డ్యూయల్ ఛానెల్ ABS స్టాండర్డ్‌గా ఉంటుంది.
Miss World 2025: తెలంగాణను ప్రశంసలతో ముంచెత్తిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు..!

ఫీచర్లు:
ఈ బైక్‌లో 5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉంది. దీనిలో Honda RoadSync యాప్ కనెక్టివిటీ, బ్లూటూత్ ఆధారిత నావిగేషన్, కాల్ అలెర్ట్స్, మీడియా కంట్రోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గియర్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా, Honda Selectable Torque Control (HSTC), ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్.. స్పోర్ట్, స్టాండర్డ్, రైన్, యూజర్ వంటి నాలుగు రైడింగ్ మోడ్‌లు లభిస్తాయి.
ధర:
ఈ బైక్ ధరను రూ. 8.59 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూన్ నెల నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి. ఈ కొత్త బైక్ మిడ్-సైజ్ నేకెడ్ సెగ్మెంట్‌లో ప్రీమియమ్ ఫీచర్లతో భారత బైక్ ప్రేమికులను ఆకట్టుకునే అన్ని అర్హతలు ఈ బైక్ కలిగి ఉంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!