Motorola Razr 60: 50MP + 32MP కెమెరా, 6.96-అంగుళాల భారీ డిస్ప్లేతో రాబోతున్న మోటరోలా Razr 60 ఫ్లిప్ ఫోన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Razr 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా, తన తాజా ఫోల్డబుల్ ఫోన్ Motorola Razr 60 ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫ్లిప్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ మే 28 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్ అలాగే కొన్ని ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మరి త్వరలో రాబోతున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి చూసేద్దామా..
Read Also: VITAMIN C: విటమిన్ C అధికంగా లభించేందుకు తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..!
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

డిస్‌ప్లే:
Motorola Razr 60 లో 6.96-అంగుళాల Full HD+ pOLED LTPO ప్రధాన డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1Hz నుండి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను మద్దతు ఇస్తుంది. 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో పాటు స్పష్టమైన, స్మూత్ వ్యూయింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 3.63-అంగుళాల pOLED ఎక్స్‌టర్నల్ కవర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ స్క్రీన్‌ను Corning Gorilla Glass Victus తో ఉంచారు.
ప్రాసెసర్, స్టోరేజ్:
ఈ ఫోన్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనికి 8GB LPDDR4X RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ జతచేయబడ్డాయి. ఇది మల్టిటాస్కింగ్, పవర్ ఎఫిషియెన్సీ పరంగా మంచి పనితీరును అందిస్తుంది.

కెమెరా:
ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 13MP అల్ట్రా వైడ్ + మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించబడుతుంది.
బ్యాటరీ, చార్జింగ్, ఇతర ఫీచర్లు:
Motorola Razr 60 లో 4,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. అలాగే IP48 రేటింగ్ తో నీటి, ధూళి నిరోధకత కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫోల్డబుల్ ఫోన్ లవర్స్ కోసం స్టైలిష్ డిజైన్, ప్రీమియమ్ ఫీచర్ల కలయికగా నిలవనుంది. మే 28న విడుదలయ్యే ఈ ఫోన్ ధర కంపెనీ లాంచ్ రోజు తెలియనుంది.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!