Site icon NTV Telugu

IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ.. ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్!

Virat Kohli Jersey No 18

Virat Kohli Jersey No 18

రెండు నెలలుగా అభిమానుల్ని ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజుతో ముగుస్తుంది. టైటిల్ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా ఆ జట్టు పదిహేడేళ్ల కల నెరవేరుతుంది. అయితే ఆర్సీబీనే గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్‌కి తొలిసారి ఆడుతున్నాడు. కోహ్లీ పదిహేడేళ్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆర్సీబీ గెలిస్తే చూడాలని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అభిమానులతోతో పాటు సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఆర్సీబీ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. ఆర్సీబీ గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. కోహ్లీ జెర్సీ నంబర్‌తో ఈ రోజు డేట్, నెల, సంవత్సరంతో పోల్చి చూస్తున్నారు. కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాబట్టి.. జూన్ మూడు ప్లస్, ఆరో నెల ప్లస్, 2025 కలిపితే మొత్తం నంబర్ 18 అవుతుంది. దీంతో కాలం కూడా కోహ్లీ టైటిల్ గెలవాలని నిర్ణయించిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది.

Also Read: RCB vs PBKS: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ఫైనల్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!

అయితే ఆర్సీబీ అభిమానులను భయపెడుతున్న మరో విషయం ఉంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య జెర్సీ నంబర్ కూడా 18నే. ఇది పంజాబ్‌కు కూడా కలిసిరానుంది. కాబట్టి ఈ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 14 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రియాంష్ ఆర్య 16 మ్యాచ్‌ల్లో 451 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి జెర్సీ నంబర్ 18 ఎవరికి కలిసొస్తుందో చూడాలి.

Exit mobile version