NTV Telugu Site icon

Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!

Virat Kohli Ipl Title

Virat Kohli Ipl Title

Virat Kohli Criticises Wankhede Crowd: దశాబ్దానికి పైగా భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. భారతీయ అభిమానుల్లో చెరగని ముద్ర వేశాడు. విరాట్ తన బ్యాటింగ్‌తో భారత్‌లోనే కాదు విదేశాల్లో కూడా ఎందరో అభిమానులను సంపాదించాడు. కింగ్ మైదానంలోకి దిగుతున్నాడంటే.. మైదానం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోతోంది. ఫాన్స్ అందరూ ‘ కోహ్లీ-కోహ్లీ’ అంటూ అరుస్తూ స్టేడియాన్ని హోరెత్తిస్తుంటారు. అయితే భారత స్టేడియంలో ఇండియన్ ఫాన్స్.. కోహ్లీ-కోహ్లీ అని కాకుండా ‘చీటర్-చీటర్’ అని నినాదాలు చేశారు. ఇది కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసింది.

సొంత దేశంలో విరాట్ కోహ్లీని ‘చీటర్-చీటర్’ అని భారత ఫాన్స్ నినాదాలు చేసిన ఘటన 11 సంవత్సరాల క్రితం జరిగింది. ఐపీఎల్ 2013 సీజన్‌లో విరాట్ తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలోని ఫాన్స్ ‘చీటర్-చీటర్’ అంటూ నినాదాలు చేశారు. ప్రేక్షకుల ఈ చర్యతో విరాట్ హృదయం బద్దలు అయింది. అదే వాంఖడే స్టేడియంలో 2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లో 50వ సెంచరీని సాధించిన సమయంలో స్టేడియం మొత్తం ‘కోహ్లీ-కోహ్లీ’ అంటూ కేకలు వేయడం గహనార్హం.

Also Read: Dinesh Karthik: దినేష్ కార్తీక్ స్కూప్ సిక్స్.. విరాట్ కోహ్లీ సంబరాలు!

ఇలాంటి ఘటనే తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్ సందర్భంగా హార్దిక్‌ను ఫాన్స్ ట్రోల్ చేశారు. గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌ని కెప్టెన్‌గా చేయడంతో అసంతృప్తిలో ముంబై అభిమానులు హార్దిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రేక్షకులు అతనిపై అసభ్య పదజాలం ఉపయోగించారు. మైదానంలో కుక్క పరుగెడుతుండగా.. హార్దిక్‌, హార్దిక్‌ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబదించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.