RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్సీబీ విధ్వంసం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ ఆర్సీబీ ఓపెనర్లు వారి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరుగుల వరద పారించింది. ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ మెరుపు దాడికి తోడు చివర్లో టిమ్ డేవిడ్ సిక్సర్లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది.
READ ALSO: Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!
Also Read
- Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
- Nara Lokesh: 'రప్పారప్పా' అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
- Sachin Tendulkar: "ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!" ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
- Meenakshi Natarajan: "మేము జోక్యం చేసుకోలేం".. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి ఎదురుదెబ్బ
సాల్ట్ మెరుపులు.. కోహ్లీ క్లాస్
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కేవలం 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ముంబై బౌలర్లను వణికించాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 50) ఆరంభంలో నెమ్మదిగా ఆడినా, కీలకమైన అర్ధశతకంతో ఇన్నింగ్స్‌కు వెన్నుముకగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాల్ట్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాటిదార్, మొత్తంగా 20 బంతుల్లో 53 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 34 నాటౌట్) ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు. దీంతో ఆర్సీబీ సరిగ్గా 240 పరుగులు చేసింది.
ముంబై బౌలర్లు విలవిల..
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4 ఓవర్లలో 36 పరుగులు) ఈ మ్యాచ్‌లోనూ వికెట్ తీయలేకపోయాడు. గత 5 మ్యాచ్‌లుగా బుమ్రా వికెట్ తీయకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 241 పరుగులు చేయాలి. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో చేజింగ్ ఆసక్తికరంగా మారింది.
READ ALSO: Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్లతో రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం!
-
China Robot: చైనా రోబోలు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..! డ్రాగన్ టార్గెట్ అదేనా?
-
Nara Lokesh: ‘రప్పారప్పా’ అంటే చూస్తూ ఊరుకోము.. నారా లోకేష్ మాస్ వార్నింగ్!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి అడ్డంకులు?
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!