Site icon NTV Telugu

RCB Stampede: తొక్కిసలాట ఘటనపై బీజేపీ సంచలన ఆరోపణలు.. దీనికి కారణం మీరే..!

Rcb!

Rcb!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ.. “ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మొత్తం దేశం, కర్ణాటక ఆర్‌సీబీ విజయాన్ని ఘనంగా నిర్వహించారు. కానీ.. ముందస్తు సన్నాహాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విజయ ర్యాలీని నిర్వహించడానికి తొందరపడటం ఈ విషాదానికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సన్నాహాల గురించి పట్టించుకోలేదు. వారు ప్రచారంపై ఎక్కువ ఆసక్తి చూపారు. దీని ఫలితంగా 11 మందికి పైగా మరణించారు. కొంతమంది ఐసీయూలో ఉన్నారు. నేను కొంతమంది బాధితులతో మాట్లాడాను, లోపల పోలీసులు లేరు, అంబులెన్స్ సౌకర్యం లేదు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని న్యాయ విచారణకు పంపాలి.” అని ఆయన డిమాండ్ చేశారు.

READ MORE: గుండె చికిత్సలో మరో మైలురాయి.. KONAR-MF డివైస్‌కు యూఎస్ పేటెంట్..!

ఈ అంశంపై డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. “నేను పోలీస్ కమిషనర్‌తో, అందరితో మాట్లాడాను. నేను కూడా తర్వాత ఆసుపత్రికి వెళ్తాను. మృతుల సంఖ్యను ఇప్పుడు చెప్పలేం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఘటన కారణంగా ఈ కార్యక్రమాన్ని కుదించాం. కార్యక్రమం 10 నిమిషాల్లో ముగిసింది. లక్షల మంది వచ్చారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు యత్నిస్తున్నాం.” అన్నారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ స్పందించారు. వారు ఆరోపణలు చేయడానికే ఉన్నారు. మేము రక్షించడానికి ఉన్నామని వెల్లడించారు.

READ MORE: Virat Kohli: “ఇలాంటి ఫ్యాన్స్ ఏ జట్టుకూ ఉండరు”.. విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Exit mobile version