IPL2023 : విరాట్ కోహ్లీతో కయ్యానికి కాలు దువ్విన గౌతమ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లు జట్ల మధ్య పోరు జరుగుతుంది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంత మైదానంలో లక్నో టీమ్ ఓడించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టును బెంగళూరు టీమ్ ఓడించింది. లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంబీర్, విరాట్ కోహ్లీ గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో గంబీర్, విరాట్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంబీర్ స్టేడియంలోకి వచ్చి నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు చూపిస్తు సైగ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
Also Read : RCB vs LSG: ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ.. లక్నో సూపర్ జెయింట్స్‌పై సూపర్ విక్టరీ
సోమవారం రాత్రి ఇరు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగగా.. లక్నో ఓడిపోయింది. లక్నో ఫస్ట్ బౌలింగ్ చేయగా.. ఆర్‌సీబీని నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. తరువాత బ్యాటింగ్ చేసిన లక్నో.. 108 పరుగులకే కుప్పకూలిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకున్నారు. ఈ క్రమంలో గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్తూ కొట్టుకొనేంత పనిచేశారు. వీరి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరుజట్ల సభ్యులు వారిని పక్కకు తీసుకెళ్లారు. దీంతో మ్యాచ్ అనంతరం మైదానంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : RCB vs LSG: ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ.. లక్నో సూపర్ జెయింట్స్‌పై సూపర్ విక్టరీ
గత మ్యాచ్ లో లక్నో విజయం తరువాత గంభీర్ మైదానంలోకి వచ్చి అభిమానులవైపు చూస్తూ నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా సైగా చేశాడు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా క్యాచ్ అందుకున్న కోహ్లీ గంభీర్ లా చేయకూడదని సూచిస్తూ ముద్దు పెడుతున్నట్లు సైగా చేశాడు. ఈ విషయం మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య వాగ్వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడే కాదు.. ఐపీల్ 2013 సీజన్ లోనూ కోహ్లీ, గంభీర్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పడు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, ఈసారి లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ గా కోహ్లీ ఉన్నాడు. అయితే, లక్నో టీం సభ్యుడు అమిత్ మిశ్రా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనూ విరాట్ కోహ్లీ అతనితో వాగ్వావాదానికి దిగడం కనిపించింది. దీంతో అంపైర్లు వచ్చి వారిని శాంతింపజేశారు.

గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 100 శాతం.. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కొత విధించినట్లు ఐపీఎల్ నిర్వహకులు వెల్లడించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఆర్టికల్ 2.21 కింద ఈ ముగ్గిరికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!