RCB Jersey: కుంభమేళాలో ఆర్సీబీ జెర్సీకి గంగాస్నానం, ప్రత్యేక పూజలు.. ఈ సాలా కప్ నమ్‌దే!
- ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా
- ఆర్సీబీ జెర్సీకి గంగాస్నానం
- ఈసారి కప్ గెలవాలని ప్రత్యేకంగా పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటివరకు టైటిల్ కొట్టని ప్రాంచైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీ టీమ్ ట్రోఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పోరాడుతున్నప్పటికీ.. సహచర ప్లేయర్స్ మద్దతు లేకపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ టోర్నీలో అడుగుపెట్టడం.. ఒట్టి చేతులో వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలని అభిమానులు చెయ్యని ప్రయత్నాలు లేవు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ఆర్సీబీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో ఆర్సీబీ వీరాభిమాని ఒకరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీకి గంగాస్నానం చేయించాడు. త్రివేణి సంగమం వద్ద గంగానది పవిత్ర జలంలో ఆర్సీబీ జెర్సీని మూడుసార్లు ముంచాడు. అనంతరం ఆర్సీబీ ఈసారి కప్ గెలవాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుంభమేళాలో జెర్సీకి పుణ్యస్నానాలు చేసిన అభిమాని కర్ణాటకకు చెందిన వారని సమాచారం. ఈ వీడియో చూసిన బెంగళూరు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాలా కప్ నమ్‌దే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Also Read: Airtel-Jio New Recharge: ఎయిర్‌టెల్, జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ఇక వారికి పండగే!
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇటీవల తెలిపారు. మే 25న ఫైనల్ ఉంటుందని చెప్పారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది జరిగిన మెగా వేలం ద్వారా అన్ని ప్రాంఛైజీలు పటిష్ట టీంలను సిద్ధం చేసుకున్నాయి.
RCB fans with RCB Jersey at Mahakumbh in Prayagraj and praying for RCB wins the IPL Trophy. 🥹
KING KOHLI & RCB – THE EMOTIONS. ❤️
— Tanuj Singh (@ImTanujSingh) January 21, 2025
- Tags
- IPL 2025
- Jersey
- RCB
- RCB Fan
- RCB Jersey
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!