NTV Telugu Site icon

WPL 2025: శివాలెత్తిన స్మృతి మంధాన.. ఆర్‌సీబీ ఖాతాలో మరో విజయం

Smriti Mandhana

Smriti Mandhana

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు మ్యాచ్ ల గెలుపుతో ఆర్‌సీబీ టాప్ స్థానంలో నిలిచింది.

Read Also: Delhi New CM: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి బీజేపీ బిగ్ ప్లాన్..! దేని మీద ఫోకస్ పెట్టిందంటే…!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ ఆమె 22 బంతుల్లో 34 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. కానీ మిగతా బ్యాటర్లు అంతగా పరుగులు చేయలేకపోయారు. ఆర్‌సీబీ బౌలర్లలో రేణుక సింగ్ (3/23), జార్జియ వేర్హమ్ (3/25) వరుసగా 3 వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్ ను కుప్పకూల్చారు. కిమ్ గార్త్, ఎక్త్ బిష్త్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Read Also: Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. అత్యవసరంగా కార్గో విమానం ల్యాండింగ్

ఇక లక్ష్య ఛేదనలో దిగిన ఆర్‌సీబీ 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన 47 బంతుల్లో 81 పరుగులతో మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. ఆమె బ్యాటింగ్‌లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఓపెనర్ డానీ వ్యాట్-హోడ్జ్ కూడా 33 బంతుల్లో 42 పరుగులతో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత ఎల్లిస్ పెర్రీ 7 నాటౌట్, రిచా ఘోష్ 11 నాటౌట్ విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్ కు చివరి పరుగులు అవసరం సమయంలో రిచా ఘోష్ భారీ సిక్సర్‌తో ఆర్‌సీబీని గెలిపించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ సీజన్‌లో మరొక విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.