RBI : దేశంలో గడచిన కొన్ని సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు దశలవారీగా మార్కెట్ నుంచి తొలగించబడుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ శాతం నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా తిరిగి ఇచ్చారు. అయితే తాజాగా ఈ ప్రక్రియకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు తిరిగి వచ్చిన రూ.2 వేల నోట్ల పరిమాణం 98.26 శాతానికి చేరింది. ఇది మొత్తం విడుదల చేసిన నోట్లలో మెజారిటీ భాగం కావడం గమనార్హం. అయితే ఇంకా దేశవ్యాప్తంగా ప్రజల వద్ద సుమారు రూ.6,181 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మిగిలినట్టు ఆర్బీఐ గుర్తించింది.
Drug Peddlers Arrested: కూకట్‌పల్లిలో డ్రగ్స్.. ఏపీకి చెందిన ఆరుగురు అరెస్ట్
ఈ నోట్లను మార్చుకోవడానికి ప్రజలు ఎంపిక చేసిన పోస్టాఫీసులు లేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా తమ వద్ద ఈ నోట్లు ఉన్నవారు వీలైనంత త్వరగా వాటిని సరైన మార్గంలో మార్చుకోవాలని సూచించింది. నగదు పరిమితిని నియంత్రించేందుకు, నల్లధనం నిలుపుదల, క్లీన్స్ నోట్ల పాలసీ అమలు వంటి కారణాలతో 2023లో రూ.2 వేల నోట్లు మార్కెట్ నుంచి ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇవి చెలామణిలో ఉండకుండానే క్రమంగా బ్యాంకులు తిరిగి స్వీకరిస్తున్నాయి. ఆర్బీఐ ఈ ప్రక్రియపై స్పష్టతనిచ్చిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంకా తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఆలస్యం చేయకుండా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
