Banking Rules: మీరు ATMకి డబ్బు తీసుకోవాడిని వెళ్ళినప్పుడు పొరపాటున కానీ.. లావాదేవీ విఫలమై ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది తరచుగా జరుగుతుంది. అందుకే, ఆర్‌బీఐ కఠిన నిబంధనలు రూపొందించింది. ఎవరికైనా ఏదైనా నగదు లావాదేవీ విఫలమైతే, పరిమిత వ్యవధిలో బ్యాంక్ తిరిగి చెల్లిస్తుంది. కానీ, ఇది జరగకపోతే బ్యాంకు తన కస్టమర్ కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, విఫలమైన లావాదేవీపై ఖాతా నుండి తీసివేయబడిన డబ్బును బ్యాంక్ వాపసు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఇలా చేయకుంటే రోజుకు రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క కఠినమైన నియమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Read Also: Actress Kasturi : ముందస్తు బెయిల్ కోరిన పరారీలో ఉన్న నటి కస్తూరి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇందులో TATని సమం చేయాలని అంటే.. సమయానికి తిరిగి కస్టమర్‌లకు పరిహారం చెల్లించాలని సూచనలు ఇవ్వబడ్డాయి. ఆర్‌బిఐ ప్రకారం లావాదేవీ విఫలమైతే డెబిట్ చేసిన డబ్బును గడువులోపు బ్యాంకు రివర్స్ చేయకపోతే.. దానిపై బ్యాంకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే పెనాల్టీ రోజువారీగా పెరుగుతుంది.
లావాదేవీ స్వభావాన్ని బట్టి అంటే.. విఫలమైన లావాదేవీ రకాన్ని బట్టి బ్యాంక్ పెనాల్టీని చెల్లిస్తుంది. మీకు నియంత్రణ లేని లావాదేవీ వైఫల్యం వెనుక ఏదైనా కారణం ఉంటే మాత్రమే బ్యాంక్ పెనాల్టీని చెల్లిస్తుంది. మీ లావాదేవీ రివర్సల్ సమయం మీకు తెలిస్తే, మీరు బ్యాంక్‌ని సంప్రదించి పెనాల్టీని అడగవచ్చు. మీరు ATMలో లావాదేవీ చేసి మీ ఖాతా నుండి డబ్బు తీసివేయబడినా, నగదు ఉపసంహరించబడనట్లయితే లావాదేవీ జరిగిన రోజు నుండి 5 రోజులలోపు బ్యాంకు దానిని రివర్స్ చేయాలి. ఇది లేని పక్షంలో బ్యాంకుకు రూ.100 జరిమానా విధించబడుతుంది.
Read Also: Posani Krishna Murali: పోసానిపై పోలీసులకు ఫిర్యాదు.. సభ్య సమాజం సిగ్గుపడేలా..!
మీరు కార్డ్-టు-కార్డ్ బదిలీ చేసి మీ ఖాతా నుండి డబ్బు తీసివేయబడినా, లబ్ధిదారుడి ఖాతాకు చేరకపోతే బ్యాంకు రెండు రోజులలోపు (T+1) డెబిట్‌ను రివర్స్ చేయాలి. అంటే ఆ లావాదేవీ రోజు, మరుసటి రోజున డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేకపోతే మీకు బ్యాంకు రూ. 100 జరిమానా చెల్లించాలి. ఒకవేళ PoS, కార్డ్ ట్రాన్సాక్షన్, IMPS, UPIలో మీ ఖాతా నుండి డబ్బు తీసివేయబడినా, మరొక ఖాతాకు జమ చేయకపోతే, RBI దీని కోసం బ్యాంకుకు T+1 రోజు సమయాన్ని ఇచ్చింది. ఈ వ్యవధిలో నగదు బదిలీ చేయకుంటే మరుసటి రోజు నుంచి బ్యాంకుకు రూ.100 జరిమానా విధిస్తారు.